Telugu

ఇది ‘కథ’ కాదు ‘చరిత్ర’..!

ఆకాశమంత ఉన్నత వ్యక్తిత్వం, భూదేవంత ఓర్పు, నీటికున్నంత స్వచ్ఛత, వాయువుకున్నంత బలం, అగ్నికున్నంత వెలుగు అన్ని కలగలిపిన నిలువెత్తు నిదర్శనం మెగా స్టార్ చిరంజీవి. చిరుకి ముందు చిరుకి తరువాత అన్నట్లుగా తెలుగు సినిమా ప్రపంచం దిశా దశ మార్చారు మెగాస్టార్.

ADVERTISEMENT

‘పునాది రాళ్ల’తో ఇండస్ట్రీలో ‘మెగా’ అనే బ్రాండ్ కి పునాది వేసుకుని తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో ‘ఖైదీగా’ బంది అయ్యి, అంచలంచలుగా ‘స్వయం కృషితో’ ఎదుగుతూ, అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులకు ‘రాక్షసుడి’లా మారి అందరి మనసుల్లోనూ ‘చంటబ్బాయి’ గా ‘ఆరాదించ’బడ్డారు చిరు.

ఆ సినిమాలో నటించిన అబ్బాయి పేరు చిరంజీవిట అనుకునే పరిస్థితుల నుండి చిరంజీవి సినిమా విడుదలవుతుంది టికెట్లు దొరుకుతాయా అనే స్థాయికి ఎదగడానికి మెగాస్టార్ కు ఎక్కువ సమయం పట్టలేదని చెప్పాలి. కమర్షిల్ సినిమాలకు తన డాన్స్ లు, ఫైట్లతో కొత్త సొగసులు అద్ది తన సినిమా టికెట్ల కోసం ఫాన్స్ థియేటర్ల ముందు ఫైట్లు చేసుకునే స్థితికి ప్రేక్షకుడిని తీసుకు వచ్చారు చిరు.

చిరు సినిమా థియేటర్లోకి వస్తే అది ఆయన అభిమానులకు ఒక పండుగే. ఎదిగిన కొద్దీ ఒదగడం, తన తోటి వారికీ చేయుత నివ్వడం, అజాతశత్రువుగా మెలగడం ఒక్క చిరుకే సాధ్యమా అన్నంతలా ఆయన వ్యవహారశైలి ఉంటుంది. సాయం కోసం తన తలుపుతట్టిన వారికీ ‘ఆపద్బాంధవుడి’లా, తనతో పటు ఎదగాలనుకున్న వారికీ ఒక ‘అన్నయ్య’ లా, ఇండస్ట్రీలో ‘అందరివాడు’గా, బాక్స్ ఆఫీస్ ‘ఘరానా మొగుడిగా’ కొన్ని దశాబ్దాల పాటు నెంబర్ 1 గా ఇండస్ట్రీని ఏలిన ‘జగదీక వీరుడు’ చిరంజీవి.

ఒంటరిగాతానూ నడిచిన ముళ్ళ బాటను తన వారసులకు రాజా బాటగా మార్చి మెగా అనే టాగ్ ను తగిలించి వారిని స్టార్ హీరోల స్థాయికి చేర్చారు చిరు. తన వారి కోసమే కాదు తన దగ్గరకు వచ్చిన ప్రతి వారి కోసం, వారి ఎదుగుదల కోసం ఎప్పుడు ముందుంటారు చిరు. ఇండస్ట్రీ ద్వారా సమాజం నుంచి చాల తీసుకున్నాం దానిలో కొంత తిరిగి ఇచ్చేద్దాం అనే భావంతో చిరు బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు స్థాపించి ఎంతోమందికి పునర్జన్మ అందించారు.

ఇండస్ట్రీలో తన కష్టంతో సంపాదించుకున్న కోట్లాదిమంది అభిమానాన్ని సైతం సమాజ శ్రేయస్సు కోసం పురికొల్పుతున్న ‘విశ్వంభరుడు’ చిరు. తన ఎదుగుదలకు అడ్డు పడిన ప్రతి సమస్యను ఒక ‘ఛాలెంజ్’ గా తీసుకుని ‘విజేత’గా నిలిచారు. చిరంజీవి జీవితం ఒక ‘కథ కాదు చరిత్ర’. అది అందరికి ఆదర్శ ప్రాయం.

నాలుగు దశబ్దాలుగా సినీ రంగంలో రాజ్యమేలుతూ ఆయన కళామ్మతల్లికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం చిరుని పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లతో సత్కరించింది. 1955 లో పుట్టిన ఈ మొగల్తూరు మొనగాడు కొణిదెల శివ శంకర వర ప్రసాద్ తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో మెగాస్టార్ గా ఎప్పటికి చిరంజీవే. ఒంటరిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి శిఖరం అంత ఎత్తు ఎదిగిన మెగా స్టార్ చిరంజీవి కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రేమ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు.

నా దృష్టిలో అన్నయ్య ఆపద్బాంధవుడు. కావాల్సిన వారి కోసం ఎంతకైనా తగ్గే గుణం, అభ్యర్దించే మనస్తత్వం చిరంజీవిగారి సొంతం, ఆ గుణమే ఆయనను ఈ స్థాయికి తీసుకువచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న సమయంలో జనసేనకు రూ. 5 కోట్ల విరాళాన్ని అందజేసి విజయాన్ని అందుకోవాలని తమ ఇలవేల్పు ఆ ఆంజనేయుడి సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారు.

వారి ఆశీస్సుల బలమే ఈ నాటి జనసేన విజయం. అలాంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతు తల్లిలాంటి తమ వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుడిని మనసారా కోరుకుంటున్నానని అన్న మీద తనకున్న ప్రేమను, వదిన మీద ఉన్న గౌరవాన్ని మరోసారి బయటపెట్టారు పవన్ కళ్యాణ్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వల్లభనేనికి ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదే!

మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 5నెలలు జైల్లో ఉండి వచ్చినా ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదు. తన అనుచరులతో…

2 minutes ago

Finally Good News! UPI Fees Is Postponed!

India has emerged as one of the biggest digital currency markets in the world thanks…

28 minutes ago