
గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాలు మొత్తం పవన్ కేంద్రంగా సాగుతున్నాయి. అసలు తెలంగాణలో ఊసే లేని జనసేనను వారి వారి రాజకీయ, వ్యక్తిగత విమర్శలతో, ప్రాంతీయవాద రాజకీయాలతో లైవ్ లైట్ లోకి తెచ్చారు కొంతమంది తెలంగాణ మేధావులు, ఎమ్మెల్యే లు, మంత్రులు.
భవిష్యత్ లో ఎదో జరుగుతుందని, గతంలో జరిగింది కూడా అదే అని ఇలా ఎవరి ఊహాగానాలకు వారు పదును పెట్టుకుంటూ రాజకీయ విశ్లేషకుల ముసుగులో కొందరు, తెలంగాణ జర్నలిస్టుల పేరు చెప్పుకుంటూ మరికొందరు, తెలంగాణ ఉద్యమ నాయకులుగా ట్యాగ్ వేసుకుంటూ మరికొందరు మీడియా ముందుకొచ్చి పవన్ పై మూకుమ్మడి దాడి చేసారు.
ఇక నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టి. జనసేన ఏర్పాటు చేసిన సభకు కూడా పోలీసులు, న్యాయస్థానం అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ తన ప్రసంగాన్ని తన ఇంటి నుంచే సాగించారు. ముందుగా ఊహించినట్టుగానే తన పై నోరుపారేసుకున్న కాంగ్రెస్ నాయకులకు, రాజకీయ అనలిస్టులకు, తెలంగాణ జర్నలిస్టుల పేరుతో రెచ్చిపోయిన వారికీ పవన్ అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమకారులుగా చెప్పుకుంటూ ఇప్పుడు మీడియా ముందుకొచ్చి తనను బెదిరిస్తున్న సోకాల్డ్ కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ కొసం ఒక్కసారైనా గొంతు విప్పారా.? ఇక్కడ పవన్ అడుగుపెడితే ఉరుకోము అంటున్నారు తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగీరా.?
ఎక్కడో పుట్టిన కాంగ్రెస్ దేశమంతా విస్తరించవచ్చు, కానీ తెలంగాణలో పుట్టిన జనసేన తెలంగాణలో ఉండకూడదా.? ఒక జాతీయ పార్టీ నాయకులుగా చెప్పుకునే కాంగ్రెస్ నేతలు ఇప్పుడొచ్చి ఒక ప్రాంతీయ భావజాలాన్ని వన్నేవేస్తున్నారా.? అంటూ పవన్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది నాయకులు మాత్రమే అంటూ తన విమర్శలకు ఒక టాగ్ లైన్ ఇచ్చారు.
అయితే అందులో నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి మినహాయింపు లభించింది. తన పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ అడ్డగోలు విమర్శల వెనుక రేవంత్ ఉన్నారని తానూ భావించడం లేదని, రేవంత్ అంటే తనకెంతో ఇష్టమని, ఎంతో కష్ఠపడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారని, రేవంత్ పై తనకు ఆ గౌరవం ఎపుడు ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు.
అలాగే నాడు రేవంత్ టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి కూడా రేవంత్ కు ఆహ్వానం ఇవ్వలేదని, ఎన్నో కేసులు పెట్టించుకుని, జైళ్లకు వెళ్లి, ఎన్నో రాజకీయ పోరాటాలు చేసి రేవంత్ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారంటూ రేవంత్ పై సానుకూల వ్యాఖ్యలు చేసారు పవన్.
దీనితో పవన్ కాంగ్రెస్ నాయకుల నుంచి రేవంత్ ని మినహాయించారా.? ఈ మినహాయింపు వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఏపీ సీఎం చంద్రబాబా.? బాబు కి రేవంత్ కి ఉన్న అనుబంధమా.? లేదా ప్రధాని నరేంద్ర మోడీనా.? తనతో కలిసి రేవంత్ పని చెయ్యాలి అంటూ సభా వేదికగా మోడీ ఇచ్చిన పిలుపా.? అన్నదానికి భవిష్యత్ లో సమాధానం లభించవచ్చు.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…