
సిల్వస్సాలోని డామన్ గంగా లోయ రిసార్ట్‌లో రాత్రి 11:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు ఆయన వివరించారు. మద్యం మత్తులో ఉన్న పవన్ సింగ్ తనతో కలిసి నటిస్తున్న టాప్ హీరోయిన్ అక్షర సింగ్ ను బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడని, గోడకేసి బాదాడని శశికాంత్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రిసార్ట్ సిబ్బందిపైనా ఆయన దాడి చేసినట్టు తెలిపారు.
శశికాంత్ కథనం ప్రకారం… పవన్-అక్షరలు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం సిల్వస్సా చేరుకున్నారు. గురువారం రాత్రి పూర్తిగా మద్యం మత్తులో ఉన్న పవన్ తన రూము నుంచి బయటకు వస్తుండగా అక్షర అతడిని ఆపేందుకు ప్రయత్నించింది. అంతే… ఒక్కసారిగా రెచ్చిపోయిన పవన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. గోడకేసి బాదాడు.
ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. గతంలో అక్షరను పలు సినిమాల నుంచి పవన్ తప్పించాడన్న వార్తలతో పాటు, వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని కూడా పుకార్లు సందడి చేశాయి. పలు సందర్భాల్లో అక్షరను తన ప్రేమికురాలిగా పవన్ పరిచయం చేశాడు. అయితే ఇటీవల ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బాలియాలో జ్యోతి సింగ్ అనే మరో యువతిని పెళ్లాడాడు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…