పవన్ వారసుడి సినిమా విడుదలలో ‘ట్విస్ట్’

pawan-son-movie-ishq-wala-love-release-twistపవన్ మాజీ భార్య రేణుదేశాయ్ “ఇష్క్ వాలా లవ్” పేరుతో ఒక మరాఠీ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. పవన్ మాదిరే రేణు తొలి దర్శకత్వం కూడా విమర్శకుల ప్రశంసల దగ్గరే ఆగిపోయింది. అయితే, పవన్ భార్యగా రేణు పేరు తెలుగునాట కూడా పాపులర్ కావడంతో డబ్బింగ్ చేసి తెలుగులో విడుదల చేద్దామని భావించారు. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ అధికారిక ప్రకటన వచ్చింది.

“తన ఆరోగ్య ఇబ్బందుల రీత్యా ఈ సినిమాను ధియేటర్లలో విడుదల చేయలేకపోతున్నానని, నేరుగా బుల్లితెరపై విడుదల చేస్తున్నామని, త్వరలోనే ‘ఈటీవీ’ ఛానల్ లో శాటిలైట్ ప్రీమియర్ గా ప్రసారం అవుతుందని, దీనికి సబంధించిన తేదీని త్వరలోనే తెలియజేస్తానని” రేణుదేశాయ్ ట్వీట్ చేసారు.

ADVERTISEMENT

ఈ సినిమాలో కొన్ని నిముషాల పాటు పవన్ తనయుడు అకిరా కూడా సందడి చేయడంతో… వారసుడ్ని వెండితెరపై చూడాలని ఊవ్విళ్ళూరారు. అయితే చివరికి అది బుల్లితెరకు పరిమితం కావడం పట్ల ఒకింత నిరుత్సాహపడినా, ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు కాబట్టి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.

ADVERTISEMENT
Latest Stories