డిలీట్ చేసిన పిక్ వైరల్ కాకుండా ఉంటుందా?

Payal Rajput Hot Photo Shootటాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఆర్ ఎక్స్ 100’ సుందరి పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం “కిరాతక” మూవీతో బిజీగా ఉంది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా సంగతులు అలా ఉంచితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో వరుసపెట్టి ఫోటోలను పోస్ట్ చేసింది.

ADVERTISEMENT

అయితే ఈ ఫోటోషూట్ కు సంబంధించిన పిక్ లలో ఒక పిక్ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి తొలగించడం నెటిజన్ల పాలిట మరింత క్రేజీగా మారింది. బహుశా పోస్ట్ చేసిన తర్వాత తన ముఖచిత్రం తనకే అభ్యంతరకరంగా ఉందని భావించిందో ఏమో గాని, ఆ పిక్ ను డిలీట్ చేయడం జరిగింది. అయితే అప్పటికే ఆ హాట్ పిక్ ను నెటిజన్లు డౌన్ లోడ్ చేసుకోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

డిలీట్ చేసిన పోస్ట్ లకు ఉండే క్రేజ్ సోషల్ మీడియా జనులకు తెలియనిది కాదు. దీంతో పాయల్ ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టడం షరా మామూలుగా జరిగిన అంశమే. ఆ జాగ్రత్త ఏదో పోస్ట్ పెట్టకముందే ఉన్నట్లయితే ఇన్ని తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు కదా అని కామెంట్స్ రావడంలో తప్పు లేదు కదా!

ADVERTISEMENT
Latest Stories