
రామ్ చరణ్ హీరోగా ‘పెద్ది’ జూన్ 4న విడుదల కాబోతోంది. ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ పడతాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ టికెట్స్ ఆదాయంలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలని, లేకుంటే పెద్దిని తమ (సింగిల్ స్క్రీన్) థియేటర్లలో విడుదల చేయమని ఖరాఖండీగా చెప్పేశారు.
దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. కనుక సినీ పరిశ్రమలో పెద్దలు చొరవ తీసుకొని వారిని ఒప్పించి పెద్ది రిలీజ్‌కి ఆటంకం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒకరు.
ఆయన వారికి విజ్ఞప్తి చేస్తూ “ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. ఇప్పుడు పెద్ది రిలీజ్ కాకపోతే తెలుగు సినిమా గౌరవం దెబ్బ తింటుంది. సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులు నష్టపోతారు. థియేటర్లకు నష్టం కలుగుతుంది. కనుక అందరూ పెద్ద మనసు చేసుకొని పెద్ది విడుదలకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను,” అని అన్నారు.
ఓ పెద్ద సినిమా రిలీజ్‌కి ఆటంకం ఏర్పడగానే సినీ పరిశ్రమలో కొంతమంది ఇలా మీడియా ముందుకు వచ్చి సినీ పరిశ్రమకి కష్టం వచ్చింది. సినీ కార్మికుల జీవితాలు దెబ్బ తింటాయని మొసలి కన్నీళ్ళు కార్చుతుంటారు.
కానీ సినీ కార్మికులు జీతాలు పెంచాలని కోరినప్పుడు ఏ నిర్మాత వచ్చి వారి తరపున మాట్లాడరు. పైగా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు సుమారు నెల రోజుల పాటు షూటింగ్‌లు నిలిపివేశారు కదా?
అప్పుడు సినీ పరిశ్రమ గౌరవం, భవిష్యత్, సినీ కార్మికుల కష్టాలు, థియేటర్ల యజమానుల కష్టనష్టాలు ఏవీ గుర్తు రాలేదు. సినీ కార్మికుల మెడపై కత్తి పెట్టినట్లు షూటింగ్‌లు నిలిపివేసి చర్చలకు కూర్చొన్నారు.
అప్పుడు కూడా బండ్ల గణేష్ వంటివారు ముందుకు వచ్చి ఈవిధంగా మాట్లాడి ఉండి ఉంటె నేడు అయన మాటలకు విలువ ఉండేది.
అలాగే పెద్ద సినిమాల కారణంగా చిన్న సినిమాలకు థియేటర్లు దొరకక, ముందు అనుకున్న సమయానికి రిలీజ్ చేసుకోలేక బలవంతంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చినప్పుడు బండ్ల గణేష్ వంటివారు వచ్చి ‘అయ్యో’ అని సానుభూతి చూపరు. కానీ ఇది మెగా సినిమా కనుక అందరూ వచ్చి పెద్ది తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడేస్తుంటారు. బండ్ల గణేష్ థియేటర్ల యజమానులకు విజ్ఞప్తి చేసే బదులు సాటి నిర్మాతలకే పర్సంటేజ్ విధానానికి ఒప్పుకోవాలని విజ్ఞప్తి చేయోచ్చు కదా?
అయినా ఎవరికీ వారు ఇలా ప్రెస్‌మీట్‌లు పెట్టుకొని ఏదేదో మాట్లాడేస్తూ సమస్యని మరింత జటిలం చేసుకునే బదులు అందరూ కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవచ్చు కదా?
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…