ఫిలిం ఛాంబర్ లో ఏం జరుగుతోంది ?

నిన్న సాయంత్రం తెలుగు ఫిలిం ఛాంబర్ నుండి అఫీషియల్ లెటర్ అంటూ విడుదలైన డాక్యుమెంట్ విషయంలో జరిగిన హడావుడి చూసాక.. అసలు ఫిలిం చాంబర్ లో ఏం జరుగుతుంది? అనే ప్రశ్న తలెత్తింది. నిన్న “పెద్ది” సినిమాకి ఎలాంటి అడ్డంకులు లేవని, ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ సిస్టమ్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని, ఆంధ్రాలో టికెట్ హైప్ మీద 7% షేరింగ్ అని, కొత్త పర్సంటేజ్ సిస్టమ్ ను మూడు వారాల్లో ఫైనలైజ్ చేస్తారని సదరు డాక్యుమెంట్ లో పేర్కొన్నారు.

అయితే.. ఆ డాక్యుమెంట్ అన్నీ మీడియా ఛానల్స్ మరియు సోషల్ మీడియా ఎకౌంట్స్ లో వైరల్ అయ్యాక.. అసలు ఆ డాక్యుమెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది కాదని, కనీసం ఛాంబర్ పెద్దల సంతకాలు కూడా లేవని, కుదిరితే ఆ డాక్యుమెంట్ పెట్టిన పోస్ట్ ను డిలీట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ లు వచ్చాయి.

ADVERTISEMENT

ఇదంతా సరే అనుకునే సమయానికి.. సునీల్ నారంగ్ ఛాంబర్ లో తన పొజిషన్ కి రిజైన్ చేసినట్లు వార్త బయటికి వచ్చింది. ఛాంబర్ లో ఒక సినిమా కోసం పెడుతున్న ప్రెజర్ ను తట్టుకోలేక మరియు ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా చేశానని సునీల్ నారంగ్ పేర్కొన్నారు.

సురేష్ బాబు అధ్యక్షతన వర్క్ అవుతున్న ఫిలిం ఛాంబర్ లో అసలు ఏం జరుగుతుంది? ఆన్ అఫీషియల్ నోట్, అది కూడా సంతకాలు లేకుండా బయటికి ఎలా వచ్చింది? సునీల్ నారంగ్ ఎందుకని సడన్ గా రిజైన్ చేసారు? ఇదంతా “పెద్ది” సినిమా విషయంలో ప్రొడ్యూసర్స్ పెడుతున్న ప్రెజర్ ఎఫెక్టా? ఈ ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

No More H-1B Slots in 2026: Visa Holders Stranded

For the past few months, Indians booking H-1B slots have only seen the No Slots…

26 minutes ago

Naslen as Ruthless Villain Opp Suriya: Big Blunder?

Following the back to back success of Lokah Chapter 1: Chandra and Mollywood Times, Malayalam…

46 minutes ago