కొడుకు లిక్కర్ మాఫియా..తండ్రి భూమాఫియా.?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన పెద్దిరెడ్డి కుటుంబం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు.

అయితే ఇప్పుడు ఆ కుటుంబం కూటమి ప్రభుత్వంలో మాఫియా డాన్ల పాత్రలో ఆరోపణలు ఎదుర్కొంటుంది. పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి బైలు మీద బయటకొచ్చారు.

ADVERTISEMENT

ఇక ఇప్పుడు తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సుమారు 70 ఎకరాలు మంగళం అటవీ భూముల ఆక్రమ అంటూ డిప్యూటీ సీఎం పవన్ నుంచి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

దీనితో తండ్రి భూ మాఫియా డాన్ గా తనయుడు లిక్కర్ మాఫియా డాన్ గా ఖ్యాతి గడించారు అంటూఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

అయితే లిక్కర్ కేసులో అరెస్టులతో మిథున్ రెడ్డి వరకు వెళ్లిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అటవీ భూముల అక్రమణతో పెద్దిరెడ్డి వరకు చర్యలకు వెళుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే మంగళం పేట భూముల విషయంలో పవన్ కళ్యాణ్ ద్వేషపూరితంగా తమ పై ఆరోపణలు చేస్తున్నారంటూ మిథున్ రెడ్డి పవన్ పై ఎదురుదాడికి సిద్ధమయ్యారు.

పవన్ ఆరోపిస్తున్నట్టుగా అవి అటవీ భూములు కావని, ఆ భూమిని 2000 లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, అందుకు సంబంధించిన భూమి డాక్యుమెంట్లు ఆన్ లైన్ లో ఉన్నాయంటూ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

అలాగే పవన్ ఆరోపణలలో వాస్తవం లేదని ఆ ఆరోపణలను నిరూపించలేకపోతే ఏపీ డిప్యూటీ సీఎం తమకు క్షమాపణలు చెబుతారా.? అంటూ పవన్ కు సవాల్ విసిరారు పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి. అయితే ఇటు పెద్ది కుటుంబానికి మద్దతుగా వైసీపీ కూడా తన సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ పవన్ పై విమర్శలు ఎక్కుపెట్టింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali US Bookings: Tier-1 Hopes but Tier-3 Numbers?

Vijay Deverakonda’s Ranabaali is heading towards its USA premieres, but the early pre-sales are raising…

22 minutes ago

Nana Patekar’s Death: Tanushree’s ‘Evil Dead’ Remark

There may have been serious differences between Tanushree Dutta and Nana Patekar, but death is…

38 minutes ago