పెద్ది రెడ్డి గారి ఆరోపణలు…..నమ్మడానికి ప్రజలు సిద్ధమా..?

రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే ప్రస్తుతానికి రాళ్ల దాడుల సంస్కృతీ నడుస్తుంది అంటూ గర్వంగా చెప్పుకునే స్థాయికి ఏపీని దిగజార్చారు వైసీపీ నేతలు. తమ పై దాడి జరిగితే, అసలు విచారణే చేపట్టకుండా, సాక్ష్యాధారాలు చూపించకుండా దానికి ప్రతిపక్షాలే కారణం అంటూ నెపం మొత్తం వారి మీదకు నెట్టి ప్రజలలో సింపతీ సృష్టించే ప్రయత్నంలో ఉన్న అధికార పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి.

ADVERTISEMENT

జగన్ కు జరిగిన అదే రాయి దాడి పవన్, బాబుల మీద కూడా జరగడంతో బాబు మీద చేసిన ఆరోపణలకు శుభం కార్డు వేస్తారు అనుకున్న వైకాపా నేతలు…ఈ దాడులకు కూడా బాబే కారణం అంటూ మరో బాంబు పేల్చారు. జగన్ మీద ఉన్న అక్కసుతో, బాబు పట్ల సింపతీ కోసం ఈ రెండు దాడులను బాబే ప్లాన్ చేసారంటూ వైసీపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న పెద్ది రెడ్డి ఆరోపిస్తున్నారు.

అసలు నమ్మడానికి కొంచెం కూడా ఆస్కారం లేని ఈ ఆరోపణలను ప్రజలు ఏమేరకు విశ్వసిస్తారు అనేది ఎన్నికల ఫలితాల తరువాతే బయటపడుతుంది. అయితే పెద్ది రెడ్డి చెపుతున్నట్లుగా బాబు సింపతీ కోసమే తన పైన దాడి చేపించుకుని ఉంటే, అదే సింపతీ జగన్ కు కూడా వస్తుందనే ఆలోచన బాబు కు ఉండదా..? జగన్ కు సింపతీ రావడానికి బాబు జగన్ మీద దాడికి ప్రయత్నిస్తాడా..? అనే ప్రశ్నకు పెద్ది రెడ్డి దగ్గర జవాబు చెప్పగలరా..?

అసలు దాడికి కారణం ఏమిటి? ఎవరు? అనేదాని పైన ద్రుష్టి పెట్టకుండా దాడికి కారణం ఇతనే అంటూ అర్ధం పర్థం లేని ఆరోపణలు చేసి సమస్యను పక్కదారి పట్టిస్తున్నదెవరు..? అధికారంలో లేని వ్యక్తే ముఖ్యమంత్రి పైన, తన పైన దాడికి పాల్పడతాడా..? దాడి జరిగిన 10 నిముషాలలోనే ఎటువంటి విచారణ లేకుండా దాడికి కారణం బాబు అంటూ చెప్పగలిగిన వైసీపీ నేతలు దాడి జరగకుండా ఆపలేకపోతున్నారా..? అధికారం వారి చేతులలో పెట్టుకుని కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమవుతుంటే వాటిని ప్రజలు విశ్వసిస్తారా..?

పెద్ది రెడ్డి చెపుతున్నట్లు అన్నింటికి చంద్రబాబే కారణం అయితే బాబు ను ఎందుకు విచారించడం లేదు..? బాబు పై చర్యలకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు..? వాస్తవాలు ఎందుకు బయట పెట్టడంలేదు..? ఎటువంటి సాక్షాలు లేకుండా చేస్తున్న ఆరోపణల వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి..? ఈ ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా అంటూ టీడీపీ శ్రేణులు ఎదురుదాడి చేస్తున్నారు.

ఇప్పటికి గతంలో ఆరోపించిన కోడికత్తి, వివేకా హత్య కేసులో టీడీపీ, చంద్రబాబు కు సంబంధించిన ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేని వైసీపీ ఇప్పుడు మరో సరికొత్త ఆరోపణతో రెండు దాడుల వెనుక బాబు హస్తం అంటూ ముందుకొస్తే వైకాపా నాయకుల ఆరోపణలను నమ్మడానికి ప్రజలు సిద్ధమా..? అనేది వేచి చూడాల్సిందే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Vijay-Modi’s Metro Ride Turns Generational Meme Content?

Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…

7 minutes ago

Vijay Deverakonda vs Rajni: Can Ranabaali Make It 3-0?

Vijay Deverakonda has an interesting history at the box office with Rajinikanth. On two previous…

38 minutes ago