టైం చూసి కొడుతున్నారా బ్రో..!

కూటమి విజయం ఒక్క వైసీపీ పార్టీ శ్రేణులకు తప్ప మిగిలిన వారందరికీ కూడా పండుగ వాతావరణాన్నే తీసుకు వచ్చిందని చెప్పాలి. ఇటు రాజధాని రైతులు, వ్యాపారస్తులు, నిరుద్యగులు, పెట్టుబడి దారులు, అటు సినీ ఇండస్ట్రీ అందరికి కూటమి విజయం ఊపిరి ఇచ్చిందనే చెప్పాలి.

ADVERTISEMENT

ఎవరి స్థాయిలో వారు కూటమి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొందరు దేవుని మొక్కులు తీర్చుకుంటూ కూటమి విజయాన్ని ఆనందిస్తుంటే మరికొందరు పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నేమ్ బోర్డులు తగిలించుకుటూ సంతోషపడుతుంటే మరికొందరు ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువుగా ఇబ్బంది పడ్డ, అవమానాలు ఎదుర్కున్న, నష్టాలను మూటకట్టుకున్న పరిశ్రమల్లో తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా ఒకటి. అయితే ఎన్నడూ లేని విధంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ ఇండస్ట్రీకి ఎన్నో చేదు అనుభవాలు, మోయలేని అవమాన భారాలు ఎదురయ్యాయి.

ముఖ్యంగా పవన్ మీద ఉన్న అక్కసుతో అటు ఇండస్ట్రీని తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలి అనే జగన్ అహంతో టాలీవుడ్ మొత్తం జగన్ కు వ్యతిరేక వర్గంగా మారిపోయింది. అయితే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఏంటి మన పరిస్థితి అనే స్థాయికి ఇండస్ట్రీని ఆలోచింపచేసారు జగన్.

అయితే అందులో ఎక్కువ భాగం జగన్ కు భయపడి మోనంగా తలవంచితే, మెగాస్టార్ వంటి వారు చేతులు చాచి అర్దించారు. అయినా జగన్ అధికారం ఉంది అనే అహంకారంతో తలెగరేసారే కానీ వెనక్కి తగ్గలేదు. టాలీవుడ్ లో కూడా జగన్ అహంకారానికి తలవంచక పవన్ వెంట నడిచిన వారిలో బ్రో సినిమా నిర్మాత టీజీ. విశ్వ ప్రసాద్ ఒకరు.

అయితే ఏపీ ఎన్నికలలో కూటమి విజయం సాధించిన తరువాత సినీ ఇండస్ట్రీ కి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అనే ఆలోచనలోకి టాలీవుడ్ వచ్చింది. అందునా పవన్ కూడా తమ ఇండస్ట్రీ లో ఉన్న అగ్ర హీరోలలో ఒకరు కావడంతో ఇండస్ట్రీ కూడా ఈ విజయాన్ని తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటుంది.

దీనికి విశ్వ ప్రసాద్ ముందడుగు వేసి ఇండస్ట్రీ లో పని చేస్తున్న చిన్న, పెద్ద నటీనటులను ఆహ్వానించి కూటమి విజయానందాన్ని పంచుకున్నారు. ఇందులో ముఖ్యంగా పిఠాపురంలో పవన్ గెలుపు కోసం ప్రచారం చేసిన హైపర్ ఆది, సప్తగిరి, జబర్దస్త్ టీంతో పాటుగా, సింగర్ మంగ్లి, బేబీ నిర్మాత SKN , ఆర్బీ పట్నాయక్, రామజోగయ్య శాస్త్రి ఇలా పలువురు సెలబ్రేటిస్ అందరూ కలిసి వేడుక చేసుకున్నారు.

జనసేనాని విజయానికి శుభాకాంక్షలు తెలియచేయడానికి, టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి ఇండస్ట్రీ ముఖ్య నిర్మాతలు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ ను కలవడానికి ఈరోజు విజయవాడ పవన్ కార్యాలయానికి రానున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇండస్ట్రీ పెద్దలకు జరిగిన అవమానం ఈ కూటమి విజయోత్సవాలతో చెరుపుకోవాలనుకుంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.

నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారికి….సంస్కారవంతమైన పాలనకు మధ్య వ్యత్యాసం ఈ రోజు స్పష్టం కానుంది అంటున్నారు సినీ అభిమానులు. దీనికి తోడు సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కే దక్కడంతో ఇక ఇండస్ట్రీ సమస్యల కోసం సినీ పెద్దలెవ్వరు ఎవ్వరి ముందు చేతులు జోడించాల్సిన సందర్భం రాకపోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

The Paradise Without a Trailer: Hurting US Pre-Sales!

The Paradise is undoubtedly the biggest film of Nani’s career. With the release just days…

1 minute ago

Former Studio Boss: Why Is He Not Afraid of BO Clashes?

Some producers look for the safest possible release date. This former studio executive seems to…

22 minutes ago