
తిరుపుత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోకి గత రాత్రి 9 గంటల సమయంలో జొరబడిన ఆందోళనకారులు, విగ్రహాన్ని ధ్వంసం చేశారు. జరిగిన ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ఘటనకు కారకులుగా భావిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. విగ్రహం కళ్లు, ముక్కు దెబ్బతిన్నాయని, ఓ బీజేపీ కార్యకర్త, మరో సీపీఐ కార్యకర్త మద్యం మత్తులో ఈ పని చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పెరియార్ రామస్వామి విగ్రహం ధ్వంసంపై తమిళ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఈ ఉదయం నిరసనలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…