హూ కిల్డ్ బాబాయ్? అయ్యో పేర్ని నాని ఇదేం ప్రశ్న?

టిడిపి, జనసేనల జెండా సభ విజయవంతం అవడంతో వైసీపి సైన్యం చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. దానిలో వైసీపి ఎమ్మెల్యే పేర్ని నాని కూడా ఒకరు. ఆయన చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ, “ఆ సభలో ఆయన పదేపదే హూ కిల్డ్ బాబాయ్?అని అడిగారు. వివేకా హత్య చేసిన వాడిని పక్కనే ఉంచుకొని హూ కిల్డ్ బాబాయ్? అని అడుగుతున్నారు.

ఆ రోజు వివేకా గుండెలపై కూర్చొని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపినప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో మీరే కదా ఉన్నారు?అప్పుడే హూ కిల్డ్ బాబాయ్? అని ఎందుకు ప్రశ్నించలేదు. ఒకవేళ అవినాష్ రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డికి ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తే వెంటనే వారిపై కేసు ఎందుకు నమోదు చేయించలేదు?

ADVERTISEMENT

కనీసం జగన్‌ మీద నిండా కూడా మోపలేదు కదా? అప్పుడు మౌనంగా ఊరుకొని ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్? అంటూ నోటికి వచ్చిన్నట్లు ఏదేదో వాగుతున్నారు” అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.

పేర్ని నాని ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ చాలా వెటకారంగా మాట్లాడటం గమనిస్తే వివేకాపై వైసీపికి ఏమాత్రం గౌరవంలేదని అర్దమవుతుంది.

ఆరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న మాట వాస్తవమే. కానీ సరిగ్గా ఆప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయి. కనుక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ హత్య గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడితే రాష్ట్రం అల్లకల్లోలంగా మారుతుంది.

ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డిని ఎన్నికలలో దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడే ఈ కుట్ర పన్నారని, అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని వైసీపి చెప్పుకోకుండా ఉంటుందా?దాంతో వైసీపికి సానుభూతి ఓట్లు రాలకుండా ఉంటాయా? అందుకే చంద్రబాబు నాయుడు ఆ సమయంలో ఈ కేసు గురించి మాట్లాడలేదు. ఈ కేసుకు దూరంగా ఉండిపోయారు. తద్వారా ఆయన క్లీన్‌గా బయటపడగలిగారు. కానీ వివేకా హత్య పేరు చెప్పుకొని ఆ ఎన్నికలలో వైసీపి గెలిచి అధికారంలోకి రాగలిగింది.

అయితే వివేకా హత్య జరిగిన తర్వాత వైసీపి నేతలు ఘటనాస్థలంలో ఆడిన గుండెపోటు డ్రామా గురించి అందరికీ తెలిసిందే.

వివేకా హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహానికి బ్యాండేజీలు కట్టడం, వివేకా గుండెపోటుతో మరణించారని మీడియాకు చెప్పడం, మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించకుండా హడావుడిగా అంత్యక్రియలు చేసేందుకు సిద్దమవడం దేనికి? అప్పుడు సునీతా రెడ్డి అడ్డుపడటంతో పోస్ట్ మార్టం నిర్వహించి మళ్ళీ గుండెపోటు కాదు హత్య అని ఎందుకు చెప్పారు?

ఆ తర్వాత ఈ కేసులో ఆరోపణలు ఎదురుకొంటున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయకుండా కాపాడుకొంటూ, 5 ఏళ్ళుగా ఈ కేసు విచారణ ముందుకు సాగనీయకుండా అడ్డుపడుతున్నది ఎవరు? ఎందుకు? ఈ కేసులో న్యాయపోరాటం చేస్తున్న సునీతారెడ్డిపై వైసీపి కాలాకేయ సైన్యం ఎందుకు విరుచుకు పడుతోంది? అని ఆలోచిస్తే వివేకాని హత్య చేసింది ఎవరో తెలుస్తూనే ఉంది.

సీబీఐ అవినాష్ రెడ్డి వైపు వేలెత్తి చూపిస్తున్నా ఈ కేసుని చంద్రబాబు నాయుడు మెడలో వేసేందుకు పేర్ని నాని వంటి వైసీపి నేతలు ప్రయత్నిస్తుండటం విస్మయం కలిగిస్తుంది. సరే అప్పుడు చంద్రబాబు నాయుడు జగన్‌ని నిందించలేదు. అరెస్ట్ చేయించలేదు. మరి 5 ఏళ్ళుగా జగనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా? చంద్రబాబు నాయుడే ఈ హత్య చేయించిన్నట్లు భావిస్తే, ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయించలేదు?ఎందుకు అరెస్ట్ చేయించలేదు?హూ కిల్డ్ బాబాయ్? అని చంద్రబాబు నాయుడు అడుగుతుంటే ఎందుకు జవాబు చెప్పడం లేదు? అనే ప్రశ్నలకు పేర్ని నాని సమాధానం చెప్పగలిగితే బాగుంటుంది.

తన తండ్రిని వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డే హత్య చేయించారని, కానీ జగన్మోహన్‌ రెడ్డి వారిద్దరినీ వెనకేసుకువస్తున్నారని సునీతా రెడ్డి ఈరోజు ఢిల్లీలో ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు.

సుప్రీంకోర్టు, సీబీఐ కూడా తనకు న్యాయం చేయలేకపోతున్నాయని కనుక రాబోయే ఎన్నికలలో ప్రజలే వైసీపిని శిక్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

వైసీపి ఇప్పుడు అధికారంలో ఉంది కనుక ఈ కేసుని ముందుకు కదలనీయకుండా కట్టడి చేయవచ్చు. కానీ రేపు రాష్ట్రంలో ప్రభుత్వం మారితే?అప్పుడు సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే? అప్పుడు కూడా పేర్ని నాని వంటివారు వెనకేసుకురాగలరా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bharata Varsha’s Amma Kadhili Vacche: A Spiritual Touch

Faith, festivity, and the significance of the divine feminine come together in Amma Kadhili Vacche,…

2 minutes ago

BCCI Spoiled Vaibhav’s Confidence? WC Winner Reveals

India's team management has come under backlash for constantly changing its opening combination in T20Is.…

35 minutes ago