
సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి అయిన పేర్ని నాని పోలవరం ఇంచార్జ్ నిర్వాహకుడిగా పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లి అక్కడ పోలీస్ శాఖ వారికి చాలా పద్దతిగా “మంచి- మర్యాదల” గురించి మీడియా సాక్షిగా వివరించారు. ఈ వైసీపీ మంత్రులకు పోలీస్ ఉన్నతాధికారులు అంటే ఎంత చిన్న చూపో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతుంది. మొన్న సిదిరి అప్పలరాజు, ఇప్పుడు పేర్ని నాని ఇలా ఒక్కొక్కరు వారి అధికార సదరు పోలీస్ ఉద్యోగులపై చూపిస్తూనే ఉన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా మంత్రి పేర్ని నాని తన కార్ పార్కింగ్ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. సీఎం పర్యటనలో భాగంగా పోలవరం వెళ్లిన నాని తన కారును రోడ్ పక్కన పార్కింగ్ చేశారు. అయితే సదరు పోలీస్ సిబ్బంది ఆ కారును అక్కడ నుండి తీయ్యమని మంత్రికి సూచించారు. అలా చెప్పినందుకు గాను నా కార్ తీయమన్నది ఎవరు అంటూ ఇక నాని గారు తనదైన శైలిలో రెచ్చిపోయారు.
తన కారును తీయ్యమన్న సి.ఐ.పై ఫైరయ్యారు. ఆ మిగతా కార్లు ఎవరివి.., మీకు “మంచి – మర్యాదలు” తెలియవా, ఇప్పుడే పండగా అయిపోలేదు ఇంకా ముందు చాలా ఉంది అంటూ తీవ్ర పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. మీడియా ఉంది అనే కనీస స్పృహ కూడా లేకుండా సదరు మంత్రి గారు తనదైన శైలిలో రెచ్చిపోవడంతో ఇక ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
అయితే ఆ వీడియో చూసిన ప్రజానీకం మాత్రం ఇందులో వింతేముంది… ఇదే కదా మన మంత్రుల “మంచి – మర్యాదలు” అని ఛలోక్తులు విసురుతున్నారు.
Anand Deverakonda and Vaishnavi Chaitanya’s Epic is facing brutal trolling after its OTT premiere on…
దేశంలో లక్షలాది ప్రజల ఓట్లు ‘చోరీ’ అయ్యాయంటూ సీజేపీ, కాంగ్రెస్ మిత్రపక్షాల అధ్వర్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ…