
పోలింగ్కు ముందు, పోలింగ్ సమయంలో చెదురు ముదురు ఘటనలు జరగడం సహజమే. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఏపీలో అల్లర్లు, విధ్వంసం జరగడమే అందరినీ ఆలోచింపజేస్తోంది. అయితే ఓటర్ల తీర్పు ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యింది కనుక ఇప్పుడు దానిని ఎవరూ మార్చలేరు. కానీ ఆ చివరి ప్రయత్నం కూడా తప్పక చేస్తామన్నట్లు వైసీపి ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడారు.
“పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో గందరగోళం ఏర్పడబోతోంది. ఈసీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. కౌంటింగ్లో కేంద్రాలలో 10-15 మంది పార్టీల ఏజంట్లు ఉంటారు. ఆ సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ సంతకాలలో ఏ చిన్న తేడా కనిపించి ఏ ఒక్కరూ అభ్యంతరం చెప్పినా కౌంటింగ్ రసబాసగా మారుతుంది. కౌటింగ్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిపించాలని మేము కోరుతున్నాము. కానీ రసాభాసగా మార్చే కార్యక్రమం జరుగబోతోంది,” అని పేర్ని నాని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ ప్రక్రియని నిర్వహించేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రతీ బ్యాలెట్ పేపర్ వెనుకవైపు సంతకం చేసి ఇస్తారు. కానీ ఒక్కోసారి సంతకం చేయడం మరిచిపోయినా అది సరిపోలక పోయినా ఆ ఓట్లు పరిగణనలోకి తీసుకునేవారు కారు.
కానీ రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం కంటే ఓటు చాలా విలువైనది కనుక అది వృధా పోకూడదనే ఊదేశ్యంతో ఈసారి రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.
రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉన్నా లేకపోయినా పర్వాలేదని ఈసీ చెప్పినప్పుడు, పోస్టల్ బ్యాలట్ పత్రాలపై వారి సంతకాలను సరిపోల్చాల్సిన అవసరమే ఉండదు కదా?కానీ సంతకంలో చిన్న తేడా వచ్చినా రసాభాస తప్పదని పేర్ని నాని హెచ్చరిస్తున్నారు.
అంటే ఈ వంకతో కౌంటింగ్లో కేంద్రాలలో వైసీపి ఘర్షణ జరిగేలా కుట్ర చేస్తున్నట్లు అర్దమవుతోంది. దీనిలో మరో విషయం కూడా దాగి ఉంది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపి ఇంతగా ఎందుకు ఆందోళన చెందుతోందంటే అవన్నీ తమ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులవి కావడం వలననే. కనుక వాటిని ఏదో విదంగా పక్కన పెట్టించకపోతే వైసీపి నష్టపోతుంది.
ఏది ఏమైనప్పటికీ వైసీపి అప్పుడే ఓటమిని అంగీకరించేసి, అప్పుడే దానికి అవసరమైన అనేక సాకులు కూడా సిద్దం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
Faith, festivity, and the significance of the divine feminine come together in Amma Kadhili Vacche,…
Prabhas is known for his generous nature and lavish food spreads for his cast and…