
అయితే, అంతా బాగానే ఉంది గానీ, లక్ష్మి రాయ్ లుక్ చూస్తుంటే… ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన చేసిన కాస్ట్యూమ్స్ నే ఈ పాటలోనూ దాదాపుగా వినియోగించినట్లుగా దర్శనమివ్వడం విశేషం. ‘సర్ధార్’లో ‘తోబ తోబ… తోబా తోబా…’ అంటూ మాస్ ప్రియులను ఊపేసిన ఈ పాట బంపర్ హిట్ అయ్యింది గానీ, సినిమా ఫలితం మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో పవర్ స్టార్ అభిమానులు తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. అయితే మెగాస్టార్ మెగా మూవీ మాత్రం ఆ కోవలోకి పయనించకుడదంటున్నారు మెగా అభిమానులు.
లక్ష్మి రాయ్ లుక్ ను పక్కనపెడితే, మెగాస్టార్ లుక్ చాలా సింపుల్ గా ఉండడంతో… ఈ ప్రత్యేక గీతాన్ని చాలా సింపుల్ కాస్ట్యూమ్స్ తో తెరకెక్కిస్తున్నట్లుగా కనపడుతోంది. కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ అయినా… సెట్టింగ్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదన్న విషయాన్ని బ్యాక్ గ్రౌండ్ లో కనపడుతున్న హంగామా చెప్పకనే చెప్తోంది.
A song from a small film has unexpectedly become a headache for a Venkatesh starrer.…
There is no director in Indian cinema, who is as capable as Rajamouli when it…