Telugu

వాట్ అమ్మా వాట్ ఈజ్ థిస్.! ఈ దాడులేద్దాబ్బి?

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు వింటే పచ్చటి పొలాలతో కూడిన కోనసీమ అందాలు, తిరుపతి , శ్రీశైలం, బెజవాడ ఇంద్రకీలాద్రి వంటి మహా పుణ్య క్షేత్రాలు అందరిమదిలో మెదిలేవి.గోదారోళ్ల యాస,రాయలసీమ వాళ్ళ ఘాటు,కృష్ణ – గుంటూరు వాళ్ళ ప్రేమలతో ప్రశాంత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది.

కానీ ఇప్పుడా పరిస్థితిదీ ఉందా అనే సందేహమం నానాటికి బలపడుతుంది. చెప్పటానికి కష్టంగా ఉన్నా, వినడానికి ఇష్టంగా లేకపోయినా ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ నేతల దాడుల సంస్కృతీ పెరిగిపోతున్నది అనేదే వాస్తవం. వీటికి ఎన్నో సాక్ష్యాలను కూడా అధికార పార్టీ నేతలే ప్రజల ముందుంచుతున్నారు.

ADVERTISEMENT

ముందుగా ప్రతిపక్ష పార్టీల కార్యలయాల మీద దాడులతో మొదలుపెట్టిన వైసీపీ నేతలు అంచెలంచెలుగా తమ దాడుల సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నారు. ప్రతిపక్షాల పార్టీ కార్యలయాలతో మొదలు పెట్టిన దాడులు ప్రతిపక్ష నేతల పై కొనసాగిస్తూ ఇప్పుడు సామాన్యులు, ప్రభుత్వం ఉద్యోగుల వరకు వచ్చారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నినాళ్ళకే ఏపీలో దాడుల సంస్కృతీ పురుడు పోసుకుంది అనడానికి ఆధారాలు ఎన్నో.

వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడిగా, వైసీపీ నేతలకు అత్యంత సన్నిహితుడిగా చెప్పబడే తురక కిషోర్ అనే వ్యక్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దవెంకన్న పై మాచర్ల ప్రాంతంలో పట్టపగలు కారులో వెళుతున్న వ్యక్తుల పై కర్రలతో దాడికి ఎగబడి కారుని ధ్వంసం చేస్తూ బూతులు తిడుతూ రోడ్ల పై చేసిన రచ్చ ఏపీలో మునుపెన్నడూ కనివిని ఎరుగనిది.

అలాగే ఇబ్రహీంపట్నం వద్ద కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ కు అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నారని అక్కడ జరుగుతున్న అరాచకాలను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో అక్కడి వెళ్లిన టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు దాడికి పాల్పడిన వైనం., ఇలాగే పుంగనూరులో ఓ వ్యాపారవేత్త ఇంటి పై పెద్దిరెడ్డి అనుచరుల దాడి,కుప్పం, కారంపూడిలో ఘటనలు, అంతెందుకు సాక్ష్యాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి పై కర్రలతో, కాన్వాయి పై చెప్పులతో రాళ్లతో వైకాపా అనుచరులు పలుమార్లు దాడికి ఎగబడిన సంఘటనలు ఎన్నో.

అలాగే జనసేన పార్టీ కార్యలయాల మీద, ఆ పార్టీనేతల మీద, కార్యకర్తలమీద వైసీపీ నేతల దాష్టికాలకు కొదవేలేదు.అయితే ఇదంతా వైసీపీ నేతల దాడులలో మొదటి, రెండు దశలు మాత్రమే.ఇప్పుడు వైసీపీ అధికారం ఆఖరి ఘట్టానికి చేరుకోవడంతో వైకాపా నాయకుల దాడులు మూడో దశకు చేరుకున్నాయి. అవే పుంగనూరులో సామాన్యుల పై వైకాపా దాడులు.

తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ దాడుల బారిన పడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొన్న కావలి ఘటన మరువక ముందే ఇప్పుడు పీలేరు పేరు సామజిక మాధ్యమాలలో మారుమోగుతోంది. వైసీపీ నేతలు బారిన పడిన కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ చావుదాకా వెళ్లి వెనక్కి వచ్చి న్యాయం కోసం ఎదురుచుస్తున్నాడు. ఇప్పుడు మరో ప్రభుత్వ ఉద్యోగి అదే వరుసలో నిలబడ్డారు. వరుసలో బాధితుల సంఖ్య పెరుగుతుంది గాని నిందితుల రంగు మాత్రం మారడంలేదు.

అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మార్వో ఆఫీస్ లో కోర్ట్ వివాదంలో ఉన్నా భూమికి ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సర్వేయర్ పై వైకాపా నేతలు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి దాడికి యత్నించారు.వైకాపా అధికార భాషతో దుర్భాషలాడి సర్వేయర్ పై దాడికి ప్రయత్నించిన దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్లతో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు సామజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.

ఇలా రోజుకో దాడితో పూటకో యాగితో అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎదరికి చేరుస్తాయో అనే ఆందోళనలో ఉన్నారు ఏపీ ప్రజలు. ఒక్క ఛాన్స్ ఫలితానికి రాష్ట్రాన్ని ఈ స్థాయికి తెచ్చిన వైసీపీ పార్టీకి ఏపీ ప్రజలు మరో ఛాన్స్ ఇస్తే ఎలాఉంటుదో జస్ట్ శాంపిల్ చూపిస్తున్నారు వైకాపా నేతలు అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

వాట్ అమ్మ వాట్ ఈజ్ థిస్.! ఈ దాడులేద్దాబ్బి? అంటూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. దాడులలో వైకాపా తగ్గేదేలే అంటే ఈ సారి మా ఓట్లతో ఆపార్టీ నెగ్గేదేలే అంటూ చిత్తూరు యాసతో నెటిజన్లు వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగానే ఏసుకుంటున్నారు. అయితే రాష్ట్రాన్ని దాడులతో ఫేమస్ చేసే వాడు కావాలా రాష్ట్రానికి దారి చూపించేవాడు కావాలో ప్రజలే విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని ప్రజాస్వామ్య వాదులు కోరుకుంటున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Review: USA Premiere Report

Ranabaali First Half: It takes time to get used to VD in this role, and…

3 hours ago

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

6 hours ago