
మంగళవారం రాత్రి 11.30 గంటల సమయాన జూబ్లీహిల్స్ రోడ్డు నం.81లో ఉన్న మహేష్బాబు ఇంటి ప్రహరీ పక్కగా పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కాపలాదారులు అక్కడికి వెళ్లి ఓ వ్యక్తి గాయాలపాలై పడి ఉండటం గమనించారు. జూబ్లీహిల్స్ పోలీసులకు అతన్ని పట్టించారు.
నిందితున్ని విచారించి.. మూడు రోజుల క్రిందట ఒరిస్సా నుండి వచ్చాడని, పక్కనే నర్సరీ లో ఉంటున్నాడని, చోరీ కోసం వచ్చి గోడ ఎత్తు తెలియక దూకి పడ్డాడని తెలుసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ నిందితుని పేరు కృష్ణ(30) అవడం. నిందితుడు కృష్ణ మీద పోలీసులు కేసు నమోదు చేసి, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.మహేష్బాబు ఇంట్లో లేని సమయం లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
Nani's recent release The Paradise carried a massive buzz ahead of its theatrical release. Unfortunately,…
కేంద్రంలో ప్రధాని మోదీని గద్దె దించడం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వల్లకాదని మూడుసార్లు నిరూపించబడింది. అలాగే ఏపీ…