
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 148 పరుగులను మాత్రమే నమోదు చేయగలిగింది. అది కూడా చివర్లో ధోని బ్యాట్ కు పని చెప్పడంతో ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది. మరోవైపు భీకరమైన ఫాంలో ఉన్న డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ లు ఈ లక్ష్యాన్ని అవలీలగా చేధిస్తారని సన్ రైజర్స్ అభిమానులు భావించగా, వారికి షాక్ ఇచ్చే విధంగా లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయారు.
వార్నర్ క్రీజులో ఉన్నంతవరకు మ్యాచ్ హైదరాబాద్ వైపునే ఉండగా, వార్నర్ ఔటైన తర్వాత బెన్ స్టోక్స్, జయదేవ్ ల బౌలింగ్ ధాటికి ఒక్కసారిగా కుప్పకూలింది. యువరాజ్ సింగ్ మెరుపులు మెరిపించినప్పటికీ, విజయతీరాలకు చేర్చడంలో మాత్రం విఫలమయ్యాడు. చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా, చేతిలో 4 వికెట్లు ఉన్న హైదరాబాద్ జట్టు, జయదేవ్ వేసిన స్లో బౌలింగ్ కు ‘హ్యాట్రిక్’ సమర్పించారు. దీంతో ఈ విజయంతో మరో రెండు మ్యాచ్ లు ఉండగానే పూణే ప్లే ఆఫ్స్ కు చేరింది.
మరో వైపు హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 13 పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. లేదంటే బరిలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ జట్లు వరుసగా ఓటములు చవిచూస్తే తప్ప, హైదరాబాద్ కు అవకాశం దక్కే పరిస్థితి లేదు. అసలు ప్లే అఫ్స్ కు చేరడం కష్టం అనుకున్న పూణే వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకుని, మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ బరిలో నిలవడం విశేషం.
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…
BOTTOM LINE Thin Story, Patchy Laughs RATING 2/5 Story, Screenplay, Director: Venu Gopal Reddy Cast:…