Telugu

జగన్ పై నోరెత్తని నమో..వై.?

నిన్న వెలగపూడిలో జరిగిన అమరావతి పునః ప్రారంభ వేడుకలకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తామంటూ మోడీ ఏపీ ప్రజలకు మరోసారి హామీ ఇచ్చారు.

అలాగే కూటమి రాక తో అమరావతి గ్రహణం వీడింది, ఇక రానున్న మూడేళ్లలో అమరావతి ఏపీ ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ధృడంగా చేస్తుందంటూ భరోసా ఇచ్చిన నమో, గత ఐదేళ్ల వైసీపీ గ్రహణం మీద ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ADVERTISEMENT

మూడు రాజధానుల పేరుతో అమరావతి విధ్వంసానికి పూనుకున్న మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ తీరును కానీ, వైసీపీ విధానాలను కానీ నమో విమర్శించలేకపోయారు. అలాగే గత పదేళ్లుగా అమరావతి నిర్మాణాలకు అవసరమైన అన్ని సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అంటూ చెప్పిన మోడీ గత ఐదేళ్లు అమరావతిలో కనీసం ఒక్క ఇటుక పేర్చని జగన్ ను కానీ, ఒక్క బస్తా సిమెంట్ వేయని వైసీపీ ప్రభుత్వాన్ని కానీ ఎందుకు విమర్శించలేకపోయారు.

రాజధాని నిర్మాణాల కోసం కేంద్రం నిధులను వెచ్చిస్తే ఆ నిధులను వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది.? ఆ నిధులను రాజధాని నిర్మాణాలకు కాకుండా జగన్ ఎటువైపుకి మళ్లించారు.? గత ఐదేళ్ల వైసీపీ హయాంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులెంతా.? వైసీపీ చేసిన అభివృద్ధి ఎంత అనేదానిమీద కూడా మోడీ వివరించి ఉంటే వైసీపీ నోటికి కళ్లెం వేసినట్లయ్యేది.

అయితే గత ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో, ఆర్థికంగా పాతాళంలోకి నెట్టేసింది. ఇప్పటికి రాష్ట్ర రాజధాని అమరావతి పై నిత్యం విషం చిమ్ముతూనే ఉంది. కనీసం సాక్షిలో అమరావతి పునః ప్రారంభ వేడుకలను ప్రసారం చేయడానికి కూడా ఆసక్తి చూపని వైసీపీ రేపటి రోజున అధికారంలోకి వస్తే.? అన్న రాజధాని రైతుల అనుమానాలకు, ఏపీ ప్రజల సందేహాలకు సభా వేదిక ద్వారా మోడీ ఒక భరోసా కల్పించివుంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది.

రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉండరు అనే నానుడిని బలంగా నమ్మే బీజేపీ ఇటు టీడీపీ, జనసేనలతో మిత్ర బంధంలో ఉంటున్నప్పటికీ అటు వైసీపీ తో శత్రుత్వాన్ని కోరుకోవడం లేదనే సంకేతాలను నమో ఇస్తున్నారా.? లేక వైస్ జగన్ సోదరి వైస్ షర్మిల ఆరోపిస్తున్నట్టుగా జగన్ మోడీకి దత్త పుత్రుడుగా తెరచాటు రాజకీయం నడుపుతున్నారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వారి ఆరాటం.. ప్రజాస్వామ్యం కోసమా. ఓటు బ్యాంకు కోసమా?

ఎస్ఐఆర్ పేరుతో దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల కమీషన్‌ కలిసి నిర్వహిస్తున్నయా?…

1 second ago

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

28 minutes ago