
రాజకీయాలలో నానాటికి దాడుల సంస్కృతి పెరుగుతుందనే చెప్పాలి. ఒకరు నాటిన విత్తనం మరొకరికి రక్షణ కవచంగా మారింది అన్నట్టుగా ఒక పార్టీ నేతలు ప్రోత్సహించిన ఈ విష సంస్కృతి ఇప్పుడు అన్ని పార్టీలకు విస్తరిస్తుంది.
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేత పట్టాభి నాటి సీఎం జగన్ ను ఒక మాట అన్నారని వైసీపీ శ్రేణులంతా టీడీపీ కార్యాలయాల మీద దాడులతో తెగబడ్డారు. అలాగే అడ్డొచ్చిన టీడీపీ క్యాడర్ తలలు పగలకొట్టారు.
అయితే నాడు సీఎం గా ఉన్న జగన్ తన పార్టీ శ్రేణులు చేసిన ఈ విధ్వంసానికి వంత పాడుతూ నన్ను తిడితే నా పార్టీ నేతలకు బీపీలు రావా అంటూ నాటి దాడులను ప్రోత్సహించారు. కట్ చేస్తే మొన్నీమధ్య వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముఖ్యమంత్రి బాబు పై నడిరోడ్డు మీద బూతుల దండకం ఎత్తుకున్నారు.
నీవు నేర్పిన విధ్యేగా నీరజాక్షా అన్నట్టుగా టీడీపీ శ్రేణులు కూడా మాకు బీపిలోచ్చాయి, మేము దాడులు చేస్తాం అంటూ అంబటి రాంబాబు ఇంటి పై దాడులతో రెచ్చిపోయారు. ఇలా చర్యకు ప్రతి చర్య అన్నట్టుగా టీడీపీ – వైసీపీ శ్రేణుల రాజకీయ దాడులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ దాడుల సంస్కృతి ని అన్ని రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నట కనిపిస్తున్నాయి. మొన్న కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ కేంద్రంగా కాంగ్రెస్ శ్రేణులు చేసిన రచ్చ మరవకు ముందే నేడు బీజేపీ శ్రేణులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఇంటి పై దాడికి తెగబడ్డారు.
బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ పై చేసిన డ్రగ్స్ విమర్శలకు గాను బిఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బండికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. దీనితో రెచ్చిపోయిన బీజేపీ శ్రేణులు కౌశిక్ ఇంటి పై దాడికి వెళ్లి అక్కడున్న ఆయన కారు ను ధ్వంశం చేసి తమ ఆవేశాన్ని చల్లార్చుకున్నారు.
అయితే అధికారంలో ఉన్న పార్టీల నేతలు సహనాన్ని మరచి ఇలా ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద దాడులుకు దిగితే ఇక ప్రజాస్వామ్యంలో సామాన్యుడికి లా అండ్ ఆర్డర్ మీద గౌరవం ఉంటుందా.? రాజకీయ నేతల విమర్శలు హద్దు దాటితే చట్టబద్దగా చర్యలు తీసుకోవాలే కానీ ఇలా చట్టాన్ని తమ చేతులోకి తీసుకోవడం నాటి వైసీపీ పార్టీకైనా, టీడీపీ శ్రేణులకైనా, కాంగ్రెస్ క్యాడర్ కైనా, నేటి బీజేపీ నేతలకైనా సబబు కాదు అనేది గ్రహించాలి.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…