
యాభై రోజుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత చంద్రబాబుకి బెయిలు రావడం అందరు ఆహ్వానించదగ్గ విషయమే అంటు తన స్పందన తెలియచేసారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనారోగ్య సమస్యల దృష్ట్యా బాబుకి నాలుగు వారాల మధ్యంతర బెయిలు రావడం మంచిదే. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో రెట్టించిన ఉత్సహంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలంటూ ఆకాంక్షించారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు లాంటి నేతలు ఇప్పుడీ రాష్టానికి అవసరమంటూ వరుణ్- లావణ్య పెళ్లి వేడుకకు ఇటలీ వెళ్లిన పవన్ సామాజిక మాధ్యమం లో తన స్పందన తెలియచేసారు.అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి కూడా బాబుకు బెయిలు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం అంటూ చెప్పుకొచ్చారు.
తాము ముందునుంచి కూడా చంద్రబాబుని అరెస్టు చేయడానికి జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు సరికావు అంటూ ఖండిస్తూనే వచ్చాం. కానీ బాబు అరెస్టు వెనుక కేంద్ర హస్తం ఉందంటూ పలువురు బీజేపీపై విమర్శలు చేసినప్పటికీ మేము అదే స్టాండ్ మీద నిలబడ్డాము అంటూ తన స్పందన తెలియచేసారు.
విజయనగరం రైలు ప్రమాద బాధితులను పరామర్శించాడనికి వెళ్లిన నారా భువనేశ్వరి కూడా తమ పోరాటానికి న్యాయం దక్కింది. ఇది ప్రజల విజయం.ఇటువంటి కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలబడిన ప్రతి వ్యక్తికీ కృతజ్ఞత పేరు పేరునా అభినందనలు తెలియచేస్తున్నాను అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇక యుద్ధం మొదలయింది అంటూ రెట్టించిన ఉత్సహంతో అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు.
Ranabaali Review: History Without Heart A film rooted in heart-wrenching stories is let down by…
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…