Telugu

హత్యా రాజకీయాలు vs రాజకీయ హత్యలు…

తాజాగా తాడేపల్లి ప్యాలస్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ తరువాత ఏపీ రాజకీయాలలో హత్యా రాజకీయాలు – రాజకీయ హత్యలు అనే కాన్సెప్ట్ తెరమీదకొచ్చింది.

అయితే ఇవి చూడడానికి, చదవడానికే కాదు వినడానికి కూడా కాస్త ఒకేలా కనిపించినా, వినిపించినా వీటి వెనుక ఉన్న అర్ధాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి.

ADVERTISEMENT

* హత్యా రాజకీయాలు :

హత్యలతో రాజకీయాలు చేయడం అంటే రాజకీయాలలో హింస, బెదిరింపులు, దాడులు, హత్యలు, రాజకీయ ఆధిపత్య పోరాటాలు వంటి వాటిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం హత్యా రాజకీయాల జాబితాలోకి వస్తాయి. సూక్ష్మంగా ఒక్కమాటలో చెప్పాలంటే జరిగిన హత్యలను తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అన్న మాట.

ఎన్నికల సమయంలో, ఎన్నికల ఫలితాల తరువాత ఇరు పార్టీల కార్యక్తల మధ్య జరిగే ఘర్షణలు, దాడులు, హత్యలు ఈ హత్యా రాజకీయాల కిందకు వస్తాయి. అలాగే రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా ఈ హత్యా రాజకీయాల జాబితాలో చేరుతాయి.

* రాజకీయ హత్యలు:

రాజకీయ కారణాలతో హత్యలు జరగడం, ఫలితంగా రాజకీయ లబ్ది పొందడం. వంగవీటి రంగా, పరిటాల రవి, వైఎస్ వివేకనంద రెడ్డి హత్యలు రాజకీయ హత్యలకు మంచి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఒక స్పష్టమైన రాజకీయ స్వలాభం కోసం ఈ హత్యలు జరుగుతాయి.

రాజకీయ హత్యల మెయిన్ మోటివ్ కూడా రాజకీయమే అవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఒక వ్యక్తి మరణం ద్వారా కూడా రాజకీయ ప్రయోజనం పొందడం హత్యా రాజకీయం అయితే ఒక వ్యక్తిని రాజకీయ ప్రయోజనం కోసం అంతమొందించడం రాజకీయ హత్య అవుతుంది.

నాడు వైఎస్ ప్రభుత్వ హయాంలో పరిటాల రవి హత్య జరిగింది, అలాగే టీడీపీ ప్రభుత్వ హయాంలో రంగా, వివేకా హత్యలు జరిగాయి. అయితే ఇక్కడ ప్రభుత్వాలు వేరు వేరైనా రాజకీయ ప్రయోజనం పొందింది మాత్రం ఒక్కరే కావడం, ఆ మరణాల పై విమర్శలు ఎదుర్కొన్నది కూడా ఒకే కుటుంబ సభ్యులు కావడం ఇక్కడ కొస మెరుపు.

రంగా దారుణ హత్య, పరిటాల రవి దారుణం, వివేకా గొడ్డలి వేటు తరువాత ఆ మరణాలను రాజకీయ హత్యలుగానో, హత్య రాజకీయాలుగానో ప్రచారం చేసుకుని దాని ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందినది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా టీడీపీ పార్టీ కాదు అనేది గత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను తిరగేస్తే స్పష్టత వస్తుంది. అలాగే ఆ హత్యలను తమకు అనుకూలంగా మలచుకుని రాజకీయ లబ్ది పొందింది కూడా ఎవరన్నది జగమెరిగిన సత్యమే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

One Deepfake, One Big Reality Check for Tollywood

The Janhvi Kapoor deepfake controversy may end up being remembered for something bigger than the…

25 minutes ago

Balayya Is Back, Now Dada Has No Time to Waste

For Dada, the wait is over. Balakrishna is back on the sets, the actor joining…

55 minutes ago