
ఇటు భారత్‌లో, అటు పాకిస్థాన్‌లో రాజకీయ పార్టీలు జమ్ము కశ్మీర్ ఉగ్రదాడి నుంచి రాజకీయ మైలేజ్ కోసం దేశ ప్రజలలో సెంటిమెంట్ రాజేసి యుద్ధం మొదలు పెట్టాలని, దాయాది దేశంపై ప్రతీకారం తీర్చుకోవాలని, సింధూ నదిలో నీళ్లకు బదులు రక్తం ఏరులై పారించాలంటూ మాట్లాడుతున్నాయి.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి జమ్ము కశ్మీర్ దాడిలో మృతులకు సంతాపం తెలిపారు.
ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “గతంలో పాకిస్థాన్‌తో రెండుసార్లు యుద్ధం జరిగినప్పుడు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వారికి గట్టిగా బుద్ధి చెప్పారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆమెను దుర్గామాతగా అభివర్ణించారు. కనుక ప్రధాని మోడీజీ.. మీరు కూడా ఆమెలాగే విజృంబించండి. పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించండి.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని స్వాధీనం చేసుకోండి. పాకిస్థాన్‌కి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఇదే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే యుద్ధం ప్రారంభించండి. ఈ విషయంలో యావత్ భారతీయులు మీ వెంట ఉంటారు,” అని అన్నారు.
అటు పాకిస్థాన్‌లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో నిన్న సుక్కూర్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తూ, “సింధూ నదిపై పూర్తి హక్కులు మనకే ఉన్నాయి. కానీ సింధూ జలాలు పాకిస్థాన్‌లోకి ప్రవహించకుండా అడ్డుకోవాలని భారత్ ప్రయత్నిస్తే దానిలో భారతీయుల రక్తమే ఏరులై పారుతుంది,” అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
దేశ ప్రజలకు మార్గదర్శనం చేస్తూ వారికి ఆదర్శప్రాయంగా నిలవాల్సిన రాజకీయ పార్టీల నేతలే ఈవిదంగా ప్రజలను రెచ్చగొట్టేలా ఎందుకు మాట్లాడుతున్నారంటే వారిని ఆకట్టుకోవడం కోసమే. కానీ వారి మాటలు చాలా ప్రమాదకరమైనవి. ఇటువంటి మాటలతో ముందుగా జరిగే ప్రమాదం ఏమిటంటే మతాల మద్య చిచ్చు రగిలి, మత ఘర్షణలు, అల్లర్లు జరిగి, శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది.
ఇటువంటి మాటలతో ప్రతిపక్ష పార్టీలు రాజకీయ మైలేజ్ పొందుతున్నాయని మ, మనం వెనకబడిపోతున్నామని అధికార పార్టీలు భావిస్తే, అవి కూడా మైలేజ్ కోసం ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
భారత్, పాక్ రాజకీయ పార్టీలు రాజకీయ చదరంగం ఆడటం మొదలుపెడితే మొట్ట మొదట బలయ్యేది ఇరు దేశాల సైనికులు.. ఆ తర్వాత సరిహద్దులో ప్రజలే.
కార్గిల్ వంటి చిన్నపాటి యుద్ధంలోనే 527 మంది భారతీయ సైనికులు, సుమారు 4,000 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఒకవేళ భారత్-పాక్ మద్య పూర్తిస్థాయి యుద్ధం జరిగితే ఆ మారణహోమంలో ఎన్ని లక్షల మంది సైనికులు, ప్రజలు చనిపోతారో ఎవరూ ఊహించలేరు.
ముఖ్యంగా ఇరుదేశాల వద్ద అణు బాంబులున్నప్పుడు యుద్ధం మొదలైతే జరిగేది వినాశనమే. ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు, యుద్ధోన్మాదంతో ఉన్న పాక్ సైనికాధికారులు అణ్వసత్రాలనూ తమ చేతుల్లోకి తీసుకోకుండా ఉండరు. తీసుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసు.
కనుక అణు యుద్ధం జరిగి, దేశం నాశనం అయిపోయినా పర్వాలేదని ఏ రాజకీయ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చెప్పగలరా?
యుద్ధ పర్యావసనాలను భరించే శక్తి పాకిస్థాన్‌కు లేకపోవచ్చు. కానీ భారత్‌కు ఉందా?అని ఆలోచిస్తే ఎవరూ సున్నితమైన ఈ అంశంపై రాజకీయాలు చేయరు.
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…