
ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకుండా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన మాటల మాంత్రికుడు తాజా సినిమా “అరవింద సమేత” గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే అందాల విందు చేయనుందనే టాక్ బలంగా వినపడుతోంది.
[m9ad]
“దువ్వాడ జగన్నాధమ్” సినిమాలో బికినీలో తన సౌందర్యాలను బహిర్గతపరిచిన పూజా, ‘అరవింద సమేత’లోనూ అదే ఫీట్ రిపీట్ చేయబోతోందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే అక్టోబర్ 11 వరకు వేచిచూడాల్సిందే. ఇప్పటివరకు త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమాలలో ఒక్క “జల్సా”లో మాత్రమే హీరోయిన్ ఇలియానాను స్విమ్ సూట్ డ్రెస్ చూపించారు.
అది కూడా ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా ప్రదర్శించారు. అయితే ఇటీవల కాలంలో స్విమ్ సూట్ లు, బికినీలు చాలా సహజంగా మారిపోయిన నేపధ్యంలో… వీటి ప్రాధాన్యత కూడా బాగా తగ్గిపోయింది. కానీ త్రివిక్రమ్ సినిమాలో బికినీ సోయగాలు అంటూ జరుగుతున్న ప్రచారం మాత్రం ప్రేక్షకుల ఆసక్తిని రాబట్టింది.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…