
ఈ చిత్రం నవంబర్లో ప్రారంభమవుతుంది మరియు మొదటి షెడ్యూల్లోనే నటి జట్టులో చేరనుంది. పూజా ఇటలీలో రాధే శ్యామ్ కీలక షెడ్యూల్ పూర్తి చేసి హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఆ చిత్రం కోసం రెండు వారాల షెడ్యూల్ పూర్తి చేయడానికి మిగిలి ఉంది. దానితో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది.
ఈ చిత్రాలతో పాటు, ఈ నటి కి టాలీవుడ్ లో అఖిల్ అక్కినేని యొక్క టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఉంది. అది కూడా పూర్తయ్యే దశలో ఉంది. అన్నీ కుదిరితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది. మరో వైపు రాధే శ్యామ్ వచ్చే ఏడాది సమ్మర్ కు గానీ విడుదలయ్యే అవకాశం లేదు.
ఈ రెండు సినిమాలూ కాకుండా పూజా టాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ ని ఇప్పటివరకు సైన్ చెయ్యలేదు. రణ్వీర్, జాక్వెలిన్, వరుణ్ షామా, పూజా హెగ్డే నటించిన సిర్కస్ పూర్తి స్థాయి కామెడి ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాతో బాలీవుడ్ లో పాగా వెయ్యాలని నటి భావిస్తోంది. చూడాలి ఏం రాసిపెట్టి ఉందొ!
కొన్ని పదాలు, సంఖ్యలు కొన్నిటికి ప్రతీకలుగా మారుతుంటాయి. అటువంటిదే ‘11’కూడా. గత ఎన్నికలలో 175/175 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి…
Telangana BJP president N. Ramchander Rao is among the contenders for the Hyderabad–Rangareddy–Mahabubnagar Graduate MLC…