Telugu

పోసానికి అర్దమైంది… కానీ డ్యామేజ్ జరిగిపోయిందిగా!

వైసీపీకి పక్క వాయిద్యాలు వంటివారు రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి, లక్ష్మీ పార్వతి తదితరులు. వైసీపీ ఏ కష్టం వచ్చినా ఆ పక్క వాయిద్యాలు వెంటనే మొగుతుంటాయి. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్ వ్యవస్థపై నిప్పులు చెరుగుతుండటంతో పోసాని కృష్ణ కూడా ‘ఆన్’ అయిపోయి పవన్‌ కళ్యాణ్‌ని చెడామడా దులిపేశారు. అయితే 24 గంటలు గడవక మునుపే ఆయన తాళం మార్చారు. ఈసారి కాస్త సాఫ్ట్‌గా వాయిద్యం వాయించారు.

“నిజానికి పవన్‌ కళ్యాణ్‌ చాలా మంచోడే. కానీ ఆయనను చంద్రబాబు నాయుడే చెడగొడుతున్నారు. పవన్‌! నీకు అబద్దాలు చెప్పడం చేతకాదు. నువ్వు అబద్దం చెపుతుంటే నీ మొహంలో తెలిసిపోతుంటుంది. ఇలాంటివి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ వంటివారికే బాగావచ్చు. జగన్‌ జనాలకు మేలు చేస్తుంటే ఓర్వలేకపోతున్న చంద్రబాబు నాయుడు నిన్ను ఆయన మీదకు ఉసిగొల్పుతున్నాడని తెలుసుకో రాజా! నువ్వు, సినిమాలలో కింగ్ లాంటివాడివే కానీ రాజకీయాలలో కాదు. కనుక ఎవరి చెప్పుడు మాటలో విని ఏదేదో మాట్లాడేసి నీ ఇమేజ్‌ పాడు చేసుకోకు… అని వినమ్రంగా చెపుతున్నా రాజా,” అని అన్నారు.

ADVERTISEMENT

పోసానికి జగన్‌ ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. పైగా వచ్చే ఎన్నికలలో మళ్ళీ పోటీ చేయాలనుకొంటున్నారు కూడా. కనుక ఆయన వైసీపీ తరపున వకాల్తా తీసుకొని పవన్‌ కళ్యాణ్‌పై గట్టిగా ఎదురుదాడి చేయడం సహజం.

అయితే వచ్చే ఎన్నికలలో ఒకవేళ టికెట్‌ ఇవ్వకపోతే… ఇచ్చినా గెలవలేకపోతే… వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాలేకపోతే….. అప్పుడు పోసాని పరిస్థితి ఏమిటి? అంటే మళ్ళీ అదే టాలీవుడ్‌లో… అదే చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, తదితర హీరోల సినిమాలలోనే వేషాలు వేసుకొంటూ బ్రతకాల్సి ఉంటుంది. పవన్‌ కళ్యాణ్‌ వెనుక సినీ పరిశ్రమను శాశిస్తున్న మెగా ఫ్యామిలీ ఉంది. కనుక ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ని చెడమాడా తిడుతున్నందుకు వారి సినిమా తలుపులు ఎలాగూ పోసానికి మూసుకుపోతాయి.

వారేగాక జూ.ఎన్టీఆర్‌, మహేష్ బాబు, ఇంకా పలువురు నిర్మాతలు, దర్శకులు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టిడిపి, జనసేనలతో కనెక్ట్ అయ్యే ఉన్నారు. వారు కూడా పోసానిని దూరం పెట్టడం ఖాయం. కనుక ఖర్మకాలి వైసీపీ అధికారం కోల్పోతే అప్పుడు పోసాని తిరిగి టాలీవుడ్‌లో అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగని వైసీపీని అంటిపెట్టుకొని ఉంటే వారితో పాటు ఆయనకు కూడా వాతలు తప్పవు.

అయితే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను తిట్టేందుకే జగన్‌ ఆయనకు ఆ పదవి ఇచ్చారు కనుక వారిని తిట్టక తప్పదు. కనుక చంద్రబాబు నాయుడు విషయంలో కాస్త హార్డ్ గా మాట్లాడినా పవన్‌ కళ్యాణ్‌ విషయంలో కాస్త సాఫ్ట్‌గాపోవడమే బెటర్ అని పోసాని అనుకొన్నట్లున్నారు.

కానీ పోసాని నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేస్తూ ఇప్పటికే ఇండస్ట్రీతో రిలేషన్స్ చాలా డ్యామేజ్ చేసుకొన్నారు. కనుక ఇప్పుడు వెనక్కు తగ్గినా, మరింత ముందుకు వెళ్ళినా ఆయనకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కనుక ఆ ఫ్లోలో ముందుకు వెళ్ళిపోవడమే మంచిది రాజా!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Yami Gautam’s Horror Comedy: Brutal Online Reviews

Yami Gautam’s Nayyi Navelli is finally out now in theatres. Horror comedy films are working…

29 minutes ago

ఏపీలో కాక్రోచ్లకు ఎంట్రీ ఉంటుందా.?

ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా బీజేపీ టార్గెట్ గా కాక్రోచ్లు చేస్తున్న రాజకీయానికి ఏపీలో ఎంట్రీ లభిస్తుందా.? సీజేపీ నేతలు…

56 minutes ago