
ఇటీవల రజనీకాంత్ చంద్రబాబు నాయుడుని పొగిడినందుకు ఆయనపై దండెత్తిన వైసీపీ సేనలో పోసాని కూడా ఉన్నారు. “రజనీకాంత్‌కి పనిలేకపోతే ఏపీకి వచ్చి చంద్రబాబు నాయుడి భజన చేసుకోమనండి. మాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన తమిళనాడు ప్రజలకే సూపర్ స్టార్ కానీ మాకు కాదు. మా సూపర్ స్టార్… మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఆయనకు జగనన్న అంటే ఎంతో అభిమానం. జగనన్నకు కూడా ఆయన అంటే చాలా అభిమానం,” అని పోసాని అన్నారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతున్నందుకు వారిది ‘తోడేళ్ళ గుంపు’ అని జగన్ స్వయంగా అనేకమార్లు అన్నారు. “నా తమ్ముడి గురించి ఆ విదంగా మాట్లాడుతున్నవారే నా ఇంటికి వచ్చి అతిధి మర్యాదలు స్వీకరించి మమ్మల్ని శుభకార్యాలకు ఆహ్వానిస్తుంటారని,” చిరంజీవి సున్నితంగా చురకలు వేసినా వైసీపీలో ఎవరూ పట్టించుకోలేదు.
ఏదో ఓ రోజు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏపీలో అత్యున్నత (ముఖ్యమంత్రి) పదవి అధిష్టాడని చిరంజీవి చెప్పినా పెద్దగా స్పందించలేదు. వారు స్పందించకపోయినా చిరంజీవి తన మనసులో ఉన్నది కాస్త సున్నితంగానే చెప్పేశారనుకోవచ్చు. ఒకవేళ చిరంజీవి “నేను నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కే మద్దతు ఇస్తాను… వచ్చే ఎన్నికలలో తమ్ముడికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని,” స్పష్టంగా చెప్పేసి ఉంటే ఈపాటికి సిఎం జగన్‌తో సహా మంత్రులందరూ, చిరంజీవిపై కూడా విరుచుకుపడుతుండేవారు. కానీ ఇంకా ఆ మాట చెప్పలేదు కనుక చిరంజీవిని మావాడంటున్నారు. కానీ ఎన్నికలకు ముందు ఎలాగూ చిరంజీవి తమ్ముడికి మద్దతు తెలపడం ఖాయమే. అప్పుడు పోసానితో సహా వైసీపీలో అందరూ ఆయనని తిట్టిపోయాడమూ ఖాయమే.
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…