
కేవలం బాలీవుడ్ వరకే లెక్కలు చూసుకున్నా ట్రెండ్ చూస్తే ఆర్ఆర్ఆర్ దాటే సూచనలున్నాయి. ఇంత భారీ స్పందన ప్రభాస్ కు దక్కుతుందా లేక రాముడిదా అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం ఠక్కున చెప్పడం కష్టం. ఎందుకంటే అయోధ్య రామాలయం నిర్మాణంలో ఉన్న సమయంలో జనంలో శ్రీరాముడి సెంటిమెంట్ బలంగా ఉంది. పైగా రామాయణం శతాబ్దాలుగా పవిత్ర గాథగా నీరాజనాలు అందుకుంటూనే ఉంది. పైగా ఇది హీరో పేరు మీదే నడిచే యాక్షన్ మూవీ లాంటిది కూడా కాదు.
సీతారాముల గుడి లేని ఊరు దాదాపుగా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒంటిమిట్ట, భద్రాచలం మనవైపున్న అద్భుత ఆలయాలు. అలాంటి కథను గ్రాండియర్ గా చెప్పడం భక్తుల్లోనే కాదు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేపిందిఅలా అని ప్రభాస్ ఇమేజ్ ని తక్కువ తూచడానికి కూడా లేదు. దానికి నార్త్ లో సాహోకు వచ్చిన స్పందనే ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడ డిజాస్టరైనా బాలీవుడ్ లో కమర్షియల్ గా సేఫ్ అయ్యింది. కానీ ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ బాలీవుడ్ లో కూడా పెద్దగా సౌండ్ చేసింది లేదు.
ఇప్పుడు ఒకవైపు రాముడి ఎమోషన్, మరోపక్క ప్రభాస్ ఎలివేషన్ రెండూ జత కూడటంతో అంచనాలు పెరిగాయి. దీనికి ప్రమోషన్ క్యాంపైన్ కొంత దోహదం చేస్తున్న మాట వాస్తవం రెండు చేతులో కలిస్తేనే చప్పట్లు కొట్టినట్టు ఇక్కడ రాముడు ప్లస్ ప్రభాస్ కాంబినేషన్ ఇంత స్పందనకు దోహదపడింది.
ఇంకో కోణంలో చెప్పాలంటే ఇదే ఆదిపురుష్ ని అజయ్ దేవగనో లేదా కార్తీక్ ఆర్యనో లాంటి హీరో చేసి ఉంటే ఈ స్థాయి ఫిగర్లు కనిపించేవి కాదన్నది ఒప్పుకోవాలి. ఒకవేళ 16న పాజిటివ్ టాక్ వస్తే ముందుగా ట్రెండ్ ఊపందుకునేది ఉత్తరాది రాష్ట్రాల్లోనే. అయిదు రూపాయల నాణేనికి ఏ వైపు ఎక్కువ విలువ ఉంటుందంటే ఎవరైనా ఏం చెప్తారు. ఇదీ అంతే.
After Dragon, NTR is expected to join hands with Trivikram Srinivas for GOW. However, a…
Vidya Balan has revealed that missing the chance to play legendary Carnatic singer M.S. Subbulakshmi…