హమ్మయ్యా! పవన్ అభిమానుల వేడుక కాదు కదా!

సరిగ్గా ఇదే వ్యాఖ్యలను యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అనుకుంటున్నారేమో! బయటకు వ్యాఖ్యానించనప్పటికీ మనసులో ఇదే భావం కలుగుతుందని చెప్పక తప్పదు! అలా ప్రభాస్ ను ఆలోచించుకునే విధంగా తీర్చిదిద్దారు పవన్ అభిమానులు. ఇటీవల జరిగిన “లోఫర్” ఆడియో వేడుకపై ‘పవన్ అంటే ఇష్టమని చెప్పే దాకా’ ప్రభాస్ ను మాట్లాడనివ్వకుండా బలవంతంగా అయినా వారికి కావాల్సిన మాటలను పైశాచికత్వాన్ని ప్రదర్శించి మరీ ప్రభాస్ నుండి రప్పించుకున్నారు. ఇలా పవన్ అభిమానుల ఆగడాలతో… ఆడియో వేడుకలకు హాజరు కావాలంటే మన సినీ సెలబ్రిటీలు ఒకటికి పది సార్లు ఆలోచించుకునే పరిస్థితి నెలకొంది.

అయితే, తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరో ఆడియో ఆవిష్కరణకు విచ్చేయనున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థగా భావించే యువీ క్రియేషన్స్ పతాకంపై శర్వానంద్, సురభి జంటగా నటించిన “ఎక్స్ ప్రెస్ రాజా” అనే సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో దీనికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘రన్ రాజా రన్’ తర్వాత సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత ఈ కాంభినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడం మరియు ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

Toxic OTT: ZEE5 Offer Value Crashes by Shocking 80%?

Toxic was expected to be a huge blockbuster for Yash. Instead, the film’s disastrous theatrical…

8 minutes ago

Nandana Detained! YouTuber Lands in Big Trouble

Telugu YouTuber Rama Nandana, known online as Nandu’s World, was taken into custody by RGIA…

23 minutes ago