
అయితే కొన్ని గంటల క్రితం రిలీజ్ అయిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ తమిళ ప్రేక్షకులకు, తమ సినిమా పొన్నియిన్ సెల్వన్ ని విమర్శించిన తెలుగు వాళ్ళ మీద కసి తీర్చుకునే అవకాశాన్ని కల్పించింది. ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ టీజర్ చూసిన తమిళ తంబీలు ఇది కార్టూన్ సినిమా అని, చుట్టి టి.వి. లో కార్టూన్ గా వేసుకోవాలని కామెడీ పోస్ట్లు పెడుతున్నారు. ఈ సినిమా తరువాత నిర్మాతలు నెత్తిమీద తడిగుడ్డ వేసుకోవాలని, ఆస్తులు అమ్ముకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
కొంతమంది తమిళ ఫాన్స్ ప్రభాస్ ఎన్ని ప్లాపులు ఇస్తున్నా..ఆగకుండా బాంబుల్లాంటి సినిమాలు ప్రేక్షకుల మీద వేయడం మానుకోవాలని సాహో, రాధేశ్యామ్ తరువాత ఈ ఆదిపురుష్ కూడా మరో బాంబు అవుతుందని పోస్ట్లు పెట్టి, ప్రభాస్ అభిమానులను ఇబ్బంది పెడుతున్నారు. ఆదిపురుష్ టీజర్ చూసిన ప్రభాస్ ఫాన్స్ అడ్డంగా దొరికిపోయాం రోయ్! అని బాధపడుతున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ తీస్తున్న సినిమాలు చూస్తుంటే, ఫాన్స్ మాత్రం రాజమౌళి కి రుణపడి ఉండాలి అనిపించడం ఖాయం!
Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…
బిర్యానీ వండటం అందరికీ రాదు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు అందరూ ఆడలేరు. కానీ వాటిని ఆస్వాదించగలరు. వాటి మంచి చెడ్డలు…