
అయితే తన రాజకీయ ప్రచారంపై ప్రభాస్ ఇంతవరకూ నోరు విప్పలేదని తెలుస్తోంది. కాగా, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ, నరసాపురం నియోజకవర్గాల నుంచి ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆపై 1999 నుంచి 2004 వరకూ వాజ్ పేయి మంత్రి వర్గంలో విదేశాంగ శాఖ సహాయమంత్రిగానూ సేవలందించారు. అనంతరం 2009లో హీరో చిరంజీవి ప్రారంభించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో చేరి రాజమండ్రి నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న కృష్ణంరాజు, ఇటీవల కాలంలో తిరిగి బీజేపీకి దగ్గరవుతున్నారన్న విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించనున్న పార్టీ బిజెపినేనని బలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మోడీకి ఎదురులేకుండా ఉండడంతో, కృష్ణంరాజు కూడా ఈ దిశగా ప్రభాస్ పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి తన సమకాలీన హీరోలైన పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ మాదిరి ప్రభాస్ కూడా ఏదొక పార్టీ జెండాకు జై కొడతారా? లేక మహేష్ లాగా సైలెంట్ గా ఉంటారా? అన్నది వేచిచూడాల్సిఉంది.
India head coach Gautam Gambhir has responded to the questions over Vaibhav Sooryavanshi's place in…
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…