
ఓటీటీలో విడుదల చేసేందుకు భారీ ఆఫర్ ను ‘రాధే శ్యామ్’ సొంతం చేసుకుందని, అతి త్వరలోనే ప్రకటన వస్తుందన్న ప్రచారం విస్తృతంగా జరగడంతో, ప్రభాస్ అభిమానులు కలత చెందారు. దీనిని తాజాగా చిత్ర దర్శకుడు రాధాకృష్ణ పరోక్షంగా ఖండిస్తూ, “ధియేటర్ లలో కలుద్దాం” అని రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటించారు.
దీంతో ఊపిరి పీల్చుకోవడం ప్రభాస్ ఫ్యాన్స్ వంతయ్యింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన “రాధే శ్యామ్” సినిమా సిల్వర్ స్క్రీన్ పైన చూస్తేనే ఆ అనుభూతి కలుగుతుంది. రాధాకృష్ణ తాజా ప్రకటనతో ‘రాధే శ్యామ్’ ఓటీటీ అనేది ‘అవుట్ ఆఫ్ సిలబస్’గా మారిపోయింది. మరి ఇంకా ఏదైనా సినిమాలు ఓటీటీ చర్చలు జరుగుతున్నాయో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
సంక్రాంతి నుండి వాయిదా పడిన “రాధే శ్యామ్” రిలీజ్ డేట్ పై ఇంకా స్పష్టత రాకపోవడం మాత్రం ఫ్యాన్స్ ను వేధిస్తోంది. మార్చి 18వ తేదీ అనుకున్నారు గానీ, ఈ డేట్ కు విడుదల అసాధ్యం అని తేలిపోయింది. ఏప్రిల్ 1 నుండి 28 వరకు ప్రతి వారం పెద్ద సినిమా ఉంది గనుక మే నెలలో రిలీజ్ ఉండొచ్చని భావిస్తున్నారు.
Dimple Hayathi slips into a fresh fashion zone with this airy white saree and sunshine…
Sandeep Reddy Vanga is the most dynamic filmmaker in Telugu Cinema of this moment. He…