
‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తోన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘బాహుబలి’ విడుదల తరువాత దర్శకుడు వీవీ వినాయక్ ను తాను, రాజమౌళి కలిశామని… ‘శివగామి ఎందుకు చనిపోయిందో అన్న సమాధానం లేని ప్రశ్నతో సినిమా ప్రారంభమై, బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడోనన్న సమాధానం లేని మరో ప్రశ్నతో సినిమా ముగిసిందని, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేని ఈ చిత్రం ఇంత హిట్ ఎందుకు అయింది? అని వివి వినాయక్ తమను అడిగినట్టుగా చెప్పాడు ప్రభాస్.
దేవసేన సంకెళ్లతో ఎందుకు ఉంది? అవంతిక అక్కడెందుకుంది? భల్లాలదేవుడి భార్య ఎవరు? వంటి ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయని వినాయక్ అడిగిన ప్రశ్నలను ప్రభాస్ వివరించాడు. అయితే ఈ సినిమాలో ప్రతి పాత్రకూ ఓ కథ ఉంటుందని, అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రెండో భాగంలో లభిస్తాయని చెప్పారు. సినిమాలో కొత్తదనం, యుద్ధాలు, చారిత్రక నేపథ్యం ప్రేక్షకులకు నచ్చడం వల్లే సినిమా ఇంత హిట్ అయిందనేది తన భావనగా యంగ్ రెబల్ స్టార్ తెలిపారు. అయితే ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అన్న సీక్రెట్ ఇంతవరకు ఎందుకు లీక్ అవ్వలేదు అన్న దానిపై కూడా ప్రభాస్ స్పష్టత ఇచ్చారు.
వాస్తవానికి ఏదైనా సినిమాలో ప్రేక్షకులకు ఆసక్తి, ఉత్కంఠను కలిగించే చిన్న చిన్న సీక్రెట్స్ ఉన్నా, వాటిని గురించి చిత్రీకరించే సమయంలో సినిమా యూనిట్ లో పని చేసే వారికి తెలుస్తుంది. వారి నుంచి బయటకు లీకులు వస్తాయి. కానీ బాహుబలి చిత్రానికి వందలాది మంది పని చేసినా, వారెవరికీ ఈ ప్రశ్నకు ఎందుకు సమాధానం తెలియదో చెప్తూ… ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే, సినిమాను ఆస్వాదించలేరని, కానీ దీనికి సమాధానం ఒక్క సీన్ లో ఆన్సర్ రివీల్ కాదని చెప్పాడు.
‘బాహుబలి’ సినిమా రిలీజ్ కు ముందే రెండో భాగంలోని ముఖ్యమైన సీన్ల షూటింగ్ పూర్తయిందని, అందువల్ల సెట్లో చాలామంది ఆ సీన్స్ ను సరిగ్గా చూడలేదని, అందువల్లే యూనిట్ సభ్యులకు ఈ ప్రశ్నకు సమాధానం తెలియలేదని అన్నాడు. ఓ 30 సీన్లలో జరిగిన అంశాల కారణంగా కట్టప్ప అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలుస్తుందని అన్నాడు. ఒకవేళ, మొదటి భాగం రిలీజ్ తరువాత, ఈ సీన్స్ షూట్ చేసి వుంటే, యూనిట్ లో ఎంతో మందికి జవాబు తెలిసి, ఏదొక విధంగా బయటకు వచ్చి వుండేదన్న అభిప్రాయాన్ని ప్రభాస్ వ్యక్తం చేశాడు.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…