
అయితే ఇంతవరకు ఏ అమ్మాయిని చూళ్లేదని, పుకార్లు సాధారణమని, తన పెళ్లి కుదిరితే అన్ని టీవీలు, పేపర్లలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది కదా చూడండి అన్నాడు. ఇక, మేడమ్ టుస్సాడ్ వ్యాక్స్ మ్యూజియంలో సౌతిండియన్ సినీ నటుల్లో మొట్టమొదట తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని ప్రభాస్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యూజియంకు చెందిన వాళ్ళు తన కొలతలు తీసుకుని వెళ్లారు, మైనం ఎంత ఖర్చవుతుందో తెలీదు… ఖర్చంతా వాళ్లదే కదా, మనది కాదు కదా?’ అంటూ చిరునవ్వులు చిందించాడు.
ఈ విషయాన్ని ముందుగా తన స్నేహితుడు చెప్పాడని, అతను గబగబా మాట్లాడేస్తాడని, దానికి ఆనందం కూడా తోడవడంతో వాడేం చెబుతున్నాడో మొదట తనకు అర్థం కాలేదని, దాంతో వాడు మూడు సార్లు చెప్పాల్సి వచ్చిందని ప్రభాస్ తెలిపాడు. అయితే తన స్నేహితుడు చెప్పింది విన్న తరువాత తనకు కూడా చాలా ఆనందం వేసిందని, ‘సూపర్ మేన్’, ‘స్పైడర్ మేన్’, ‘ఐరన్ మేన్’ వంటి సూపర్ హీరోస్ సరసన ‘బాహుబలి’ మైనపు విగ్రహం గ్రేట్… ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా? అన్నాడు ప్రభాస్.
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…
Rinku Singh has once again missed out on India’s T20I squad, and former India batter…