
అయితే అంతకంటే ముందే సోషల్ మీడియాలో ఈ టీజర్ లీక్ కావడం, భారీ స్థాయిలో హల్చల్ చేయడం జరిగిపోయింది. ఎలా అయితే ‘బాహుబలి 2’ తమిళ ట్రైలర్ చెప్పిన సమయం కంటే ముందుగానే ఎలా లీక్ అయ్యిందో, ఈ “సాహో” టీజర్ కూడా అలాగే లీక్ అయినట్లుగా కనపడుతోంది. ఏదో ధియేటర్లో ప్రదర్శితమైన ఈ టీజర్ ను ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా, సదరు వీడియో చూస్తే స్పష్టమవుతోంది. ఇంతకీ “సాహో” టీజర్ ఎలా ఉందంటారా?!
మరో రెండు రోజుల్లో ఎలాగో సిల్వర్ స్క్రీన్ పైన ‘బాహుబలి’తో పాటు చూస్తారుగా! అయితే భారీ అంచనాలు పెట్టుకుంటే మాత్రం కాస్త నిరుత్సాహపడవచ్చు గానీ, ఈ టీజర్ బ్యాక్ గ్రౌండ్ అయితే అదిరిపోయింది అన్నది సోషల్ మీడియా టాక్. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ సన్నిహిత సంస్థ అయిన యువి క్రియేషన్స్ నాలుగు భాషల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇంకేముంది… ఇట్స్ ప్రభాస్ షో టైం…!
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…