Telugu

1000 కోట్ల క్లబ్బులో చేరే ఛాన్స్ ఎవరికి

టాలీవుడ్ స్పీల్బర్డ్ రాజమౌళి పుణ్యమాని ఇండియన్ సినిమాకు వెయ్యి కోట్ల గ్రాస్ అందుకోవడం పెద్ద విషయం కాదని ప్రపంచానికి అర్థమైపోయింది. ప్రశాంత్ నీల్ సైతం తన కెజిఎఫ్ 2ని ఈ క్లబ్బులో చేర్చడం, షారుఖ్ ఇమేజ్ వాడుకుని అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో పఠాన్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ ఘనత సాధించడం ఎవరికైనా ఈ ఫీట్ అసాధ్యం కాదనే క్లారిటీ అందరికీ వచ్చేసింది.

అందుకే రాబోయే సీజన్లో మళ్ళీ ఈ మైలురాయి అందుకునేది ఎవరనే దాని మీద అంచనాలు మొదలయ్యాయి. నిజానికి ఓం రౌత్ కనక ఆదిపురుష్ ని చక్కగా తీసి ఉంటే జనంలో ఉన్న రాముడి సెంటిమెంట్ కి వెయ్యి ఏం ఖర్మ రెండు వేల కోట్లయినా వచ్చి పడేవి. చేతులారా బంగారంలాంటి అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. లేకపోతే సీతారాముల ఎమోషన్ కు ప్రభాస్ ఇమేజ్ తోడైనప్పుడు అద్భుతాలు జరిగి ఉండాల్సింది.

ADVERTISEMENT

సరే దగ్గరలో ఛాన్స్ ఉన్న వాళ్ళ లిస్టు తీసుకుంటే షారుఖ్ ఖాన్ జవాన్ సెప్టెంబర్ లోనే వచ్చేస్తుంది. కోలీవుడ్ దర్శకుడు అట్లీ మొత్తం తమిళ టీమ్ తో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని తీశాడు. చూసిన కథలకే కమర్షియల్ మసాలా జోడించి బ్లాక్ బస్టర్లు కొట్టే అట్లీ ఈసారి అదే మేజిక్ చేయగలిగితే సహస్రం వసూలు చేసే బాధ్యతను షారుఖ్ తీసుకుంటాడు.

సలార్ రూపంలో ప్రభాస్ కు మరో గోల్డెన్ ఛాన్స్ ఎదురు చూస్తోంది. కెజిఎఫ్ ని మించి ప్రశాంత్ దీన్ని తీర్చిదిద్దాడనే టాక్ ఇప్పటికే విపరీతంగా ఉంది. అంచనాలు అందుకుందా చాలా సులభంగా థౌజండ్ క్రోర్స్ వచ్చి పడతాయి. విజయ్ లియో మీద కూడా ఇంతే హైప్ కానీ తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ మార్కెట్ తనకు ఇంకా పూర్తి స్థాయిలో బలపడలేదు.

లోకేష్ కనగరాజ్ ఎంత గొప్పగా తీసినా విక్రమ్ హిందీ వెర్షన్ పెద్దగా ఆడలేదు. సో లియోలో యునివర్సల్ అప్పీల్ ఉంటే తప్ప వెయ్యి కోట్లు అందుకోవడం ఈజీ కాదు. యుఎస్ లో టూ మిలియన్ మార్క్ ఇప్పటికీ విజయ్ కి అందని ద్రాక్షగానే మిగిలింది. ఇంకాస్త దూరంగా చూసుకుంటే సల్మాన్ ఖాన్ టైగర్ 3, షారుఖ్ ల డుంకీలకు ఆ అవకాశం ఎక్కువగా ఉంది . వచ్చే ఏడాది లిస్టు పరిగణనలోకి తీసుకుంటే చాంతాడంత అవుతుంది.

ఏది ఏమైనా జాతీయ మార్కెట్ ఉన్న హిందీ చిత్రాలకు ధీటుగా సౌత్ సినిమా వెయ్యి కోట్ల గ్యారెంటీ ప్రాజెక్టులను వరుసబెట్టి చేయడం రాబోయే రోజుల్లో దక్షిణాది అధిపత్యానికి సూచికగానే చెప్పాలి. ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా వీళ్ళందరూ ఒకప్పుడు కలగా మిగిలిన బాలీవుడ్ లో టాలీవుడ్ జెండాను సగర్వంగా ఎగరేసే క్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఖైరతాబాద్ లో కవిత వెనుకున్న ఆ రాజకీయ బలం ఎవరు.?

ఖైరతాబాద్ ఉపఎన్నికలలో తెలంగాణ రక్షణ సేన తరుపున ఒక బలమైన అభ్యర్థిని నిలబెడతాం అంటూ కవిత చాల కాన్ఫిడెంట్ గా…

13 minutes ago

Kappi Squad Review: Average but Watchable Urban Comedy

BOTTOM LINE Average but Watchable Urban Comedy PLATFORM JioHotstar RUNTIME 1 Hour 73 Mins (4…

19 minutes ago