
దీనికి ప్రతిరూపమే ప్రభాస్ ఫేస్ బుక్ ఫాలోయర్స్ సంఖ్య. అంతకంతకూ పెరుగుతూ పోతోన్న ఈ అంకె, తాజాగా 70 లక్షలకు చేరుకుంది. దీంతో అల్లు అర్జున్ తర్వాత ఫేస్ బుక్ లో అంతటి ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరోగా యంగ్ రెబల్ స్టార్ చరిత్ర సృష్టించాడు. బన్నీ ఖాతాలో 12 మిలియన్స్ కు పైగా అభిమానులు ఉండగా, ప్రభాస్ ఖాతాలో 7 మిలియన్స్ ఉన్నారు. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు ఖాతాలో 5 మిలియన్ సంఖ్యకు చేరువలో ఉన్నారు.
అయితే ‘బాహుబలి 2’ విడుదల తర్వాత ప్రభాస్ రేంజ్ ఇంకా పెరగడం ఖాయమని, అది బన్నీని మించిపోయినా ఆశ్చర్యం లేదన్నది ప్రస్తుత టాక్. ఎందుకంటే… ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ పెద్దగా అలరించకపోయినా, ‘బాహుబలి 2’లో హైలైట్ అయ్యే వారిలో ప్రభాస్ స్థానం మొదటిదిగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నాలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్ గా ఎదగడం ఖాయమని అభిమానులు కూడా భావిస్తున్నారు.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…