
సెప్టెంబర్ 28 నుండి ప్రభాస్ సలార్ తప్పుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 28 అనేది సూపర్బ్ డేట్. వరస సెలవులు ఉన్నాయి. అందుకే హోంబేలె ఫిల్మ్స్ ఆ డేట్ ను చూజ్ చేసుకుంది. కానీ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయక తప్పలేదు. ఇప్పుడు ఆ డేట్ కు ఎవరు వస్తారు అన్నది పక్కనపెడితే సలార్ పై బోలెడన్ని హోప్స్ పెట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు మరోసారి నిరుత్సాహం తప్పలేదు. ఇప్పుడు సలార్ డిసెంబర్ కు పోస్ట్ పోన్ అని అంటున్నారు.
ఇది ఒక్క సలార్ తోనే కాదు. బాహుబలి నుండి అంటే దాదాపు ఎనిమిదేళ్ల నుండి ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ ఇక్కట్లు తప్పట్లేదు. ఒక రిలీజ్ డేట్ పై ఆశలు పెట్టుకోవడం చివరికి ఆ సినిమా వాయిదాలు పడుతూ రావడం.
బాహుబలి 1 అండ్ 2, సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్… ఇలా వరసగా అన్ని సినిమాలు కొన్ని సార్లు వాయిదా పడుతూ వచ్చి చివరికి విడుదలయ్యాయి. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చూస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ ఒక ఆశాకిరణంలా కనిపించింది. కానీ ఇప్పుడు మరికొన్ని నెలల నిరీక్షణ తప్పదు. ఇంతా వెయిట్ చేసాక మొన్న ఆదిపురుష్ లా బ్రేక్ ఈవెన్ అవుద్దో లేదో అనే భయాలు మరో వైపు!
స్థానిక సంస్థల ఎన్నికలలో సిఎం చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలకు హ్యాండ్ ఇచ్చారంటూ వైసీపీ సొంత మీడియా పుంఖానుపుంఖాలుగా కధనాలు ప్రచురిస్తూనే…
Making a commercial action film with a 75-year-old superstar is not an easy task. However,…