
సోనూసూద్ సహా ప్రధాన తారాగణంపై చిత్రీకరిస్తున్న పాటకు ప్రభుదేవా నృత్యాలు కంపోజ్ చేస్తుండగా ప్రభుదేవా ఒక్కసారిగా వెన్నునొప్పితో విలవిల్లాడిపోయారు. దీంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామని, కొన్ని రోజుల పాటు ప్రభుదేవాకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లుగా నటుడు సోనూసూద్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుగానే ఉందని, కోలుకుంటున్నట్టు పేర్కొన్నారు.
ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘అభినేత్రి’ సినిమా తెలుగుతో పాటు మరో రెండు భాషలలో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. తమిళంలో ‘దేవి’గా, హిందీలో ‘టూటక్ టూటక్ టుటియా’గా తెరకెక్కుతుండగా, ఇటీవల విడుదలైన మూడు భాషల టీజర్లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అయితే ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించడంతో, ప్రభుదేవా వెన్నునొప్పి విడుదల తేదీలో ఏమైనా మార్పు చేస్తుందేమో చూడాలి.
Salman Khan’s upcoming superhero film with director duo Raj & DK has already created strong…
Alaya F is rewriting the rules of Gen Z fashion with her latest high octane…