Telugu

నెటిజన్లు అర్ధం చేసుకోండి… కొత్తదనం కోరుకోండి..!

‘కంచె’ సినిమాలో సంప్రదాయ చీరకట్టులో మెరిసి, తెలుగింటి అమ్మాయిలా మురిపించిన అందాల ముద్దుగుమ్మ ప్రజ్ఞా జైస్వాల్, ఇప్పుడు చీరలే తనకు అడ్డంకి అయ్యాయని వాపోతోంది. ‘కంచె’ సినిమాలో ప్రగ్యా పోషించిన ‘సీత’ పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయింది. ఇక ఇటీవల కాస్తంత బోల్డ్ గా ఉన్న డ్రస్ ఆమె వేసుకుని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే, అభిమానుల నుంచి వ్యతిరేక స్పందన వచ్చింది. మీరు రాకుమారిగా, చీరకట్టులో ఉంటేనే బాగుంటారని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేసారు.

ADVERTISEMENT

దీంతో ఈ వ్యాఖ్యలపై ప్రగ్యా స్పందిస్తూ… “కంచె సినిమాతో సీత ఓవర్. ప్రతి రోజూ నేను చీరలు కట్టుకోలేను కదా? ఇప్పుడు మరోలా కనిపించాలన్నది నా ఆలోచన” అని స్పష్టం చేసింది. ఓ క్యారెక్టర్ చేసి, ఆ సినిమా హిట్ అయితే, ఆ ఇమేజ్ నుంచి బయటపడటం చాలా కష్టమని అంగీకరించిన ప్రగ్యా, తనకు అన్ని రకాల రోల్స్ చేయడమూ ఇష్టమేనని, గ్లామర్ గా కనిపించడానికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పుకొచ్చింది. పొట్టి డ్రస్ అయినా, జీన్స్ అయినా, స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఎలాంటి డ్రస్ వేసుకోవడానికైనా సిద్ధమేనని, ఈ దిశగా బ్యాలెన్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Maremma Trailer: A Riveting Story of Soil

Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…

26 minutes ago

Unexpected BO Success Gives Big Hope to 4000 Cr Ramayana?

Mythological subjects have managed to leave an impression on the audience over the last few…

41 minutes ago