ప్రకాష్ రాజ్ దిగజారుడు ఎవరి కోసం?

సినీ పరిశ్రమ లేదా మరో రంగంలో ఉన్నవారు రాజకీయాల గురించి మాట్లడరాదనే ఆంక్షలు లేవు కనుక ఎవరైనా మాట్లాడవచ్చు. అయితే సినీ పరిశ్రమలో ఉన్నవారు ఒక్క ముక్క తప్పుగా మాట్లాడినా అది అణుబాంబులా విస్పోటనం అవుతుంది. తర్వాత చిక్కుల్లో పడతారు. లేదా అది వారి సినీ కెరీర్‌పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తీవ్ర ప్రభావం చూపుతుంది.

కనుక సినీ ప్రముఖులకు వర్తమాన రాజకీయాలపై ఎటువంటి అభిప్రాయాలున్నా వాటిని బయటపెట్టరు. కేవలం ఓటు హక్కు ద్వారా తమకు నచ్చినవారికి ఓట్లు వేస్తుంటారు.

ADVERTISEMENT

కానీ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కి ఎలాంటి భయాలు, పట్టింపులు లేవు. కనుక ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ తను వ్యతిరేకించే రాజకీయ పార్టీలపై, వాటి నాయకులపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.

తాజాగా ఏపీలో ‘ప్రశ్న రావణ్’ వ్యవహారంలో అయన పేరు వినిపించడం, ఆయనపై కేసు నమోదవడంతో మళ్ళీ సోషల్ మీడియా ద్వారా వ్యంగ్యంగా “నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నేను మౌనంగా ఉన్నానంటే మిమ్మల్ని గమనించడం లేదనుకోవద్దు. మీ పార్టీలని, మీ మీడియాని, మీ రాజకీయాల్ని అన్నిటినీ చూస్తూనే ఉన్నాను.

దిగజారండి… బాగా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అని గర్వంగా చెప్పుకునేలా దిగజారండి. నేను చూస్తూనే ఉంటాను. మీరు దిగజారండి. ఇంకా ఇంకా దిగజారుతూనే ఉండండి,” అన్నారు.

ఒక పార్టీ లేదా ఓ నాయకుడు పట్ల అభిమానం ఉండటంలో తప్పు లేదు. కానీ మేదావులమని భావించేవారు. అలాంటి పార్టీలు, వ్యక్తుల వలన రాష్ట్రానికి, దేశానికి మేలు కలుగుతోందా లేక కీడు కలుగుతోందా? ఎవరు మేలు చేస్తున్నారు? ఎవరు భ్రష్టు పట్టించేస్తున్నారు? అని చూసి మాట్లాడాలి. కానీ వారు కూడా కులమతాల ఆధారంగా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఈవిదంగా వ్యంగ్యంగా మాట్లాడటం ఏవిధంగా సమర్ధించుకోగలరు?

ముఖ్యంగా అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను ఏవిధంగా సమర్ధిస్తున్నారు?అందుకు అయన సమాధానం ఏమిటి? జస్ట్ ఆస్కింగ్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sardar 2 Review: U.S. Premiere Report

Story, Screenplay, Director: P.S Mithran Cast: Karthi, SJ Suryah, Malavika Mohanan, Ashika Ranganath, Yogi Babu,…

2 hours ago

October Visa Bulletin: Relief for EB-2 & EB-3 Applicants?

October marks the beginning of the US federal fiscal year. The reset may restore the…

5 hours ago