
Prashant Kishor's performance in the Bankipur bypoll has drawn national attention, triggering fresh political discussion in Bihar.
పుష్కరకాలంగా దేశంలో ఎదురులేని ఒక రాజకీయ శక్తిగా మారిన బీజేపీ కి ఇక గ్రహాలు అనుకూలించడం లేదా.? కనీసం సరైన రాజకీయ గుర్తింపు, అనుభవం కూడా లేని పార్టీలు, ఆయా పార్టీల నేతలు బీజేపీ ఓటమిని శాసించే స్థాయికి బీజేపీ రాజకీయంగా పతనమవుతుందా.?
మొన్న ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ కేంద్రంగా బీజేపీ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన సీజేపీ నిర్వహించిన నిరసనలు బీజేపీ కేంద్ర మంత్రి రాజీనామా వరకు వెళ్లాయి. ఇక నేడు బీహార్ లో అసలు సరైన రాజకీయ గుర్తింపు లేని పార్టీ చేతిలో బీజేపీ ఓటమి అంచులలో నిలబడింది.
ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాలలో మంచి గుర్తింపు సంపాధించుకున్న ప్రశాంత్ కిషోర్ గత బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తన JSP పార్టీని బరిలోకి దింపారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన పీకే ‘జన్ సూరజ్ పార్టీ’ కనీసం డిపాజిట్లు కూడా పొందలేకపోయింది.
దీనితో ఎన్నికల వ్యూహకర్తకు తన పార్టీని గెలిపించుకోవడం తెలియలేదా అంటూ పీకే పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. అయితే నాడు తానూ ఎన్నికల పోటీలో లేకుండా తన పార్టీ అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపిన పీకే నేడు ఎన్నికల కురుక్షేత్రంలో తన తొలి అడుగు వేశారు.
బీజేపీ సీనియర్ నేత నితీన్ నవీన్ రాజీనామాతో ఖాళీ అయిన బంకీపుర్ లో నిర్వహించిన ఉపఎన్నికలలో పీకే తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత మూడు దశాబ్దాలుగా బీజేపీ దే గెలుపు. రాజకీయంగా బీజేపీకి అంత కీలక పట్టున్న ప్రాంతంలో ప్రశాంత్ కిషోర్ తన తొలి ప్రయత్నంలోనే బీజేపీ అభ్యర్థి పై విజయం దిశగా అడుగులేస్తున్నారు.
దీనితో ఇప్పుడీ వార్త దేశ రాజకీయాలలో ముఖ్యంగా బీజేపీ పార్టీలో సంచనలంగా మారనుంది. సీజేపీ నీట్ ఉద్యమం తో బీజేపీలో తొలి వికెట్ మాత్రమే పడిందని, ఇంకా పడాల్సిన వికెట్లు చాలానే ఉన్నాయంటూ నాడు ఉద్యమకారులు ఇచ్చిన నినాదాలకు ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయా అంటున్నారు బీజేపీ ప్రత్యర్థులు.
ఇక రానున్న కాలంలో బీజేపీ రాజకీయం ఇంకాస్త జటిలం కావడం ఖాయం అనేలా ప్రస్తుత పరిస్థితులు బీజేపీ కి వ్యతిరేకంగా మారిపోతున్నాయి. మరి వీటన్ని ఫలితాలను బీజేపీ అధిష్టానం అధ్యాయనం చేసి పొరపాట్లను సరిద్దిద్దుకుని తిరిగి ప్రజల నమ్మకం పొందుతుందా.? లేదా అనేది కాలమే జవాబు చెప్పాలి.
Kiran Abbavaram is coming up with an entertainer, #KA13. Written and directed by Kiran Abbavaram…
The last time the world came to a lockdown was during the Covid outbreak in…