Telugu

ప్రశాంత్ కిషోర్‌తో కటీఫ్… టిఆర్ఎస్‌కే మేలు!

వచ్చే ఎన్నికల కోసం తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌కి చెందిన ఐప్యాక్‌తో మొదట ఒప్పందం చేసుకొన్నారు. కానీ కేసీఆర్‌ తమ సలహాలు, సూచనలను పట్టించుకోవడం లేదని, కనీసం తమ బృందానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని, ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశించబోతున్నందున టిఆర్ఎస్‌కు పనిచేయలేమని చెప్పి ఐప్యాక్‌ తప్పుకొంది. అయినా సిఎం కేసీఆర్‌తో సహా ఎవరూ స్పందించకపోవడం గమనిస్తే వారికి కూడా ఐప్యాక్ సేవలపై ఆసక్తిలేదని స్పష్టం అవుతోంది.

అయితే ఎవరు ఈ ఒప్పందం రద్దు చేసుకొన్నప్పటికీ టిఆర్ఎస్‌ పార్టీకి చాలా మంచే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసి, ఇన్ని సంక్షేమ పధకాలు విజయవంతంగా అమలుచేస్తున్నప్పుడు కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్‌ సేవలు, సలహాలు అవసరమే లేదు. పైగా టిఆర్ఎస్‌ పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు వంటి హేమాహేమీలైన రాజకీయ మేధావులు, మంచి వ్యూహకర్తలు అనేకమంది ఉన్నారు. వారుండగా టిఆర్ఎస్‌కు ప్రశాంత్ కిషోర్‌వంటి వారు అవసరమే లేదు. కానీ ఎందుకో కేసీఆర్‌ ఆయన సాయం కోరారు.

ADVERTISEMENT

ఒకవేళ ప్రశాంత్ కిషోర్‌ బృందం మార్గదర్శకాల ప్రకారం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ పనిచేస్తే ఇన్నేళ్ళుగా టిఆర్ఎస్‌ ప్రభుత్వం పడిన ఈ శ్రమంతా వృదా అవుతుంది. ఆ అభివృద్ధి, సంక్షేమ పధకాల కారణంగా వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ మళ్ళీ గెలిస్తే ఆ క్రెడిట్ వారికి కాకుండా ప్రశాంత్ కిషోర్‌కే దక్కుతుంది.

ఇక మరో విషయం ఏమిటంటే, ప్రశాంత్ కిషోర్‌కి ఎన్నికలు ఓ వ్యాపారం మాత్రమే. ఆయనకు పార్టీలు, వాటి సిద్దాంతాలతో సంబందం ఉండదు. మొదట బిజెపికి పనిచేసిన ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పనిచేయడమే ఇందుకు ఉదాహరణ. డబ్బు, పేరు ప్రతిష్టల కోసం ఏ పార్టీకైనా ఆయన పని చేయడానికి సిద్దం. మరోవిదంగా చెప్పాలంటే ఆయన ఓ రాజకీయ కాంట్రాక్ట్ కిల్లర్. ఏ పార్టీ దగ్గరైనా కాంట్రాక్ట్ తీసుకొంటే, దాని ప్రత్యర్ధి పార్టీని తన తెలివితేటలు ఉపయోగించి, ఆ పార్టీని రాజకీయంగా హత్య చేస్తుంటారు. ఏపీలో గత శాసనసభ ఎన్నికలలో ఆయన వైసీపీ తరపున టిడిపిని రాజకీయంగా ఎలా హత్య చేశారో అందరూ చూశారు. వచ్చే ఎన్నికలలో కూడా ఆయన వైసీపీ కోసం పనిచేయబోతున్నారు. కనుక ఈసారి టిడిపి ఐప్యాక్‌ని కూడా మరో రాజకీయ పార్టీగా భావించి ఎదుర్కోవలసి ఉంటుంది.

ఎన్నికలని వ్యాపారంగా మార్చేసిన ఇటువంటి వ్యక్తిని నమ్మి పార్టీ వ్యవహారాలలోకి వేలుపెట్టనిస్తే అతను పార్టీ, నాయకుల బలాబలాలు, అంతర్గత వ్యవహారాలు, ఆలోచనలు, పార్టీ ఆర్ధిక పరిస్థితి అన్నీ తెలుసుకొంటాడు. రేపు మరో పార్టీకి పనిచేస్తున్నప్పుడు వాటినే ఆయుధాలుగా ప్రయోగించకుండా ఉంటారా?

తెలంగాణ సిఎం కేసీఆర్‌ త్వరలో జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్నారు. కనుక ఒకవేళ ప్రశాంత్ కిషోర్ టిఆర్ఎస్‌కు పనిచేస్తున్నట్లయితే కేసీఆర్‌ ఏవిదంగా ముందుకు సాగబోతున్నారో, ఆయన మనసులో ఆలోచనలు ఏమిటో, వ్యూహాలు, బలాబలాలు, బలహీనతలు అన్నీ ప్రశాంత్ కిషోర్‌కి ముందే తెలిసిపోతాయి.

కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచాలనుకొంటున్నారు. ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయబోతున్నారు. కేసీఆర్‌ బలాబలాలు, బలహీనతలు, వ్యూహాలు అన్నీ ముందే తెలిసి ఉంటాయి కనుక ఆయన కేసీఆర్‌ను సులువుగా ఎదుర్కొని అడ్డుకోగలుగుతారు.

అంతేకాదు… ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్‌ కోసం కూడా ఆయన పనిచేసేమాటయితే, టిఆర్ఎస్‌కు పక్కలో బల్లెంలా మారే ప్రమాదం ఉంటుంది. కనుక ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం రద్దు కావడం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ అదృష్టమనే భావించవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

The Paradise OTT Date: More Backlash Waiting on Netflix?

Nani's recent release The Paradise carried a massive buzz ahead of its theatrical release. Unfortunately,…

16 minutes ago

సీజేపీని ముందు పెట్టి పోరాటం అంటే…

కేంద్రంలో ప్రధాని మోదీని గద్దె దించడం రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ వల్లకాదని మూడుసార్లు నిరూపించబడింది. అలాగే ఏపీ…

46 minutes ago