యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు, ఆ తరువాత జరిగిన పరిణామాలతో విమర్శలు హద్దులు దాటితే దాని పర్యవసానాలు కూడా పరిధులు దాటతాయని తెలిసొచ్చేలా చేసింది. ఎవరి కళ్ళల్లోనో ఆనందం చూడడానికి, మరెవరినో మెప్పించడానికి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతే చివరికి ఫలితం అనుభవించాల్సిందే అనేది కూడా ప్రశ్న రావణ్ అరెస్టుతో నిర్ధారణ జరిగింది.
సోషల్ మీడియా వేదికగా నక్సలిజం ప్రోత్సాహం, ఆర్మీ పై అనుచిత వ్యాఖ్యలు, హిందూ దేవతల టార్గెట్ గా విమర్శలు, ఇక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వీడియోలు…ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రశ్న రావణ్ రెచ్చిపోయారు.
అరెస్టులకు భయపడేది లేదంటూ ప్రశ్న రావణ్, అరెస్టులతో గొంతు నొక్కలేరంటూ ఆయన మద్దతుదారులు కూటమి ప్రభుత్వం కు వ్యతిరేకంగా కొందరు జస్ట్ ఆస్కిన్గ్ అంటూ పోరాటం చేసారు, ఇక ప్రశ్న రావణ్ కోసం నేను సైతం అంటూ మరికొందరు ఆయనకు న్యాయసాయం చేసేందుకు ముందుకొచ్చారు, అలాగే ఇటు వైసీపీ కూడా రావణ్ కు మద్దతుగా కూటమి పై విమర్శలకు దిగింది.
కట్ చేస్తే ఉపా చట్టం కింద ఏపీ పోలీసులు చేత అరెస్ట్ అయిన రావణ్ కోసం ఇప్పుడు ఎవరు పెదవి విప్పే పరిస్థితి కనిపించడం లేదు. నాడు వారి బలమైన అండతో అరెస్టు ను కూడా లైట్ తీసుకున్న రావణ్ నేడు దాని తాలూకా బరువును మోయలేక పచ్చాత్తాపం తో అల్లాడుతున్నాడంటు ప్రచారం జరుగుతుంది.
సున్నితమైన అనేక అంశాల పై అవసరానికి మించి స్పందించానని, చేసిన తప్పుకి ఇప్పుడు ప్రాయచ్చిత్తం అనుభవిస్తున్నానని, అనవసరంగా కొందరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కోరిమరి వివాదాలలో ఇరుకున్నానంటూ ప్రశ్న రావణ్ బాధపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తానూ అరెస్ట్ అయితే తన కోసం కూటమి ప్రభుత్వం పై పోరాటం చేసేవారు చాలామందే ఉంటారు అనుకున్న ప్రశ్న రావణ్ కు ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. అయితే తాను చేసిన తప్పుకి పచ్చాత్తాపం చెందుతున్నా అంటూ తన ఆవేదన బయటపెట్టిన ప్రశ్న అసలు ఈ వివాదాలకు కారణమైన తెరవెనుక వారి గుట్టు కూడా విప్పేందుకు సిద్ధమయ్యారు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
ప్రశ్న రావణ్ గుట్టు విప్పితే ఇక తన యూట్యూబ్ లో ప్రచారమైన వివాదస్పద వీడియోల వెనుక ఉన్న కర్త, కర్మ, క్రియ ఎవరన్నది బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అటువంటి కంటెంట్ తో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని భావించినందుకు గాను ప్రశ్నకు దక్కిన ఆర్థిక సాయం పై కూడా అధికారులు విచారణ సాగిస్తున్నారు. దీనితో పోలీసుల విచారణలో రావణ్ వాటి తాలూకా ఆధారాల గుట్టు విప్పితే ఇక లంకాదహనం తప్పదా.?
Mahesh Babu and SS Rajamouli’s Varanasi is once again in news. This time with a…
Rohit Sharma has made his television debut with ‘Family Full House with Rohit Sharma’, and…