
మరీ ముఖ్యంగా రావు రమేష్ కు పడిన డైలాగులు బాగా పేలాయి. సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా పెయిర్ బావుంది. మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంటే మంచి సినిమా అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏమిటంటే… ట్రైలర్ లో విడుదల తేదిని వెయ్యలేదు. దానితో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది చూడాలి.
నిర్మాతలు గతంలో తమ సినిమా డిసెంబర్ 20 రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఆరోజున నందమూరి బాలకృష్ణ రూలర్ తో పాటు కార్తీ నటించిన తంబీ చిత్రం తెలుగులో దొంగగా, సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 చిత్రం తెలుగు వెర్షన్, హాలీవుడ్ నుండి స్టార్ వార్స్ – ది రైస్ అఫ్ స్కైవాకర్ విడుదల కాబోతున్నాయి. ఈ తరుణంలో సినిమా ఏమన్నా వాయిదా పడుతుందా అనేది చూడాలి.
ప్రతిరోజూ పండగే కు మారుతి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ స్వరాలు సమకూర్చారు. ఇటీవలే కాలంలో సాయి ధరమ్ తేజ్, మారుతీ ఇద్దరికీ సరైన హిట్లు లేవు. దానితో వారిద్దరూ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు.
Artificial intelligence is having a significant impact on the global job market, with its effects…
తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో బీఆర్ఎస్ పార్టీ నిత్యం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నామస్మరణ…