
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫైబర్ గ్రిడ్ ద్వారా చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్, వై-ఫై, కేబుల్ కనెక్షన్, వీడియో కాలింగ్ సేవలను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి ప్రారంభించే సమయానికి ఆయా ఇళ్లలో టీవీలు ఆన్ చేసుకుని ఉన్న వారితో కోవింద్ మాట్లాడతారు. అంతేకాదు వారు కూడా రాష్ట్రపతితో మాట్లాడేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాగా తొలి విడతలో రెండు లక్షల ఇళ్లకు ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు ఇవ్వనున్నారు.
ఉండవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వర్చువల్ తరగతి గదులను కోవింద్ పరిశీలిస్తారు. సచివాలయం నుంచి విద్యుత్ కారులో సీఎం కార్యాలయానికి చేరుకోనున్న రాష్ట్రపతికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో తాము ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి వివరిస్తారు. పాలనలో వేగం, కచ్చితత్వం తెచ్చేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యాలయం ఎలా ఉపయోగపడుతున్నదీ వివరిస్తారు. అలాగే ఆర్జీటీలో ఉన్న ఆసియాలోనే అతిపెద్దదైన 61 అడుగుల వీడియో వాల్ గురించి కూడా రాష్ట్రపతికి వివరిస్తారు.
టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే…
Hunkkaar arrives with a subject that is bound to generate discussion, and its teaser suggests…