Telugu

అభిమానంలో మరీ ఎక్కువ చేస్తున్నారేమో!

తమలో దాగి ఉన్న అభిమానాన్ని ఎవరికీ తోచిన విధంగా వారు చూపించుకుంటుంటారు. అయితే ప్రదర్శించే అభిమానానికి కూడా హద్దులు ఉంటాయని తెలిసిందే. ఆ బోర్డర్ దాటితే ఎవరైనా విమర్శల పాలవ్వాల్సిందే. ఆ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీని రూపాన్ని ఓ చీరపై ముద్రించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.

అయితే ఈ చీరపై ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. మహిళలు ధరించే వస్త్రధారణపై మోడీ రూపం ఉండడమేంటి అంటూ మండిపడుతున్నారు. అభిమానం చూపించుకోవచ్చు గానీ, అది ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు అంటూ హితవు పలుకుతున్నారు. ఇటీవల కాలంలో అత్యుత్సాహం చూపించే అభిమానులకు కొదవ లేకుండా పోతోంది.

ADVERTISEMENT

ముఖ్యంగా సోషల్ మీడియా విస్తరణ యువతపై పెను ప్రభావం చూపుతోందని అర్ధమవుతోంది. సోషల్ మీడియా రీత్యా తమకు తోచిన విధంగా అభిమానాన్ని ప్రదర్శిస్తూ పోస్ట్ లు చేస్తుండడమే ఈ అత్యుత్సాహానికి కారణంగా పరిశీలకులు చెప్తున్నారు. అయితే అభిమానం కురిపించే వారు మాత్రం ఇలాంటి వాటిని కూడా ‘మోడీ మేనియా’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Superstars Saving South Cinema This Summer: Next Peddi?

Since the beginning of this year, both the Kollywood and Mollywood film industries mostly depended…

38 minutes ago

Can Nayanthara Repeat SRK Magic with Salman?

Nayanthara impressed audiences with her action performance in Jawan. The actress is now preparing to…

58 minutes ago