
ఎలా చూపించబోతున్నాడో అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సాలార్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్, శృతి హాసన్, జగపతిబాబు లుక్స్ విడుదలయి అందరిని ఆకట్టుకున్నాయి.
ఈరోజు సాలార్ లో విలన్ గా నటిస్తున్న మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా.. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ పోస్టర్ లో మొహం మీద గాటుతో, మెడలో కడియాలతో చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు పృథ్వీరాజ్. చెవికి , ముక్కుకి పెట్టిన రింగులు చూస్తే వైకింగ్స్ సిరీస్ ప్రభావం ప్రశాంత్ నీల్ మీద ఇంకా పోయినట్లు లేదనిపిస్తుంది.
లుక్ ఓకే కానీ..ప్రభాస్ ముందు పృథ్వీరాజ్ విలన్ గా సరిపోతాడా అనిపిస్తుంది. రానా, కాట్రాజ్ లాంటి భారీ విలన్ అయితే ప్రభాస్ కి కరెక్టుగా సరిపోతారు. పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా సాఫ్ట్ హీరో. అప్పుడప్పుడు విలన్ పాత్రలు వేసినా అవన్నీ మేకవన్నె పులి టైపు పాత్రలే. ఈ సినిమాలో విలన్ పాత్రకు పృథ్వీరాజ్ ని ఏం చూసి ఎన్నుకున్నాడో..అసలు ప్రశాంత్ నీల్ విలన్ ని ఎలా చూపిస్తాడో సినిమా రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాలి.
Former MP Vijayasai Reddy has launched a sharp attack on the TDP-led alliance and YSRCP…
Andhra Pradesh needs a strong opposition to question the TDP-led government and hold it accountable.…