కడుపు తీపి అల్లు అరవింద్ ని మాట్లాడనివ్వలేదు పాపం

జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మితం అవుతున్న కోటబొమ్మాళి పి.ఎస్ టీజర్ లాంచ్ కు నిర్మాత అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆ సినిమా కు సంబంధించిన క్యూ అండ్ ఏ సెషన్ లో M9 News కరెస్పాండంట్ నిశాంత్ అరవింద్ ని ఒక ప్రశ్న అడగడం జరిగింది ఇప్పుడది ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చకు దారి తీసింది.

ADVERTISEMENT

చిన్న సినిమాలు కంటిన్యూ గా తీసి ఇండస్ట్రీ ని ముందుకు నడిపిస్తున్నారు అయితే ఎందుకని పెద్ద సినిమాలు తీయడంలో వెనుక బడుతున్నారు అనేది ప్రశ్న. రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి కానీ అనేక కారణాలు వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి అని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

అదే ప్రశ్న మళ్ళీ అడగగా… ‘కాస్ట్’ అంటూ సింగల్ వర్డ్ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అయితే M9 News కరెస్పాండంట్ నిశాంత్ అంతటితో ఆగకుండా.. “పరిశ్రమలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు మీ ఫ్యామిలీలోనే ఉన్నారు (అల్లు అర్జున్) అలాగే మీ ఎక్సటెండెడ్ ఫ్యామిలీ లో (చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి) ఉన్నారు… మీరు ఆ మాట అనొచ్చా,” అని అడగడంతో అరవింద్ గారు తన మార్క్ చాతుర్యంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు.

అబ్బే సినిమా కాస్ట్ లో స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు కేవలం 20-25% కాస్ట్ పెరిగింది అంతా సినిమాలు భారీ గా తియ్యడం వల్లే అని చెప్పుకొచ్చారు.

బహుశా తన ఇంట్లో తన ఫ్యామిలీ లో ఉన్న స్టార్లను తప్పుబట్టాల్సి వస్తుందని అరవింద్ గారు తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసారు.

అయితే సినిమా కాస్ట్ లో హీరోల రెమ్యూనరేషన్ 20-25% అనేది ఎక్కడో ఒకటి అరా సినిమాల విషయంలో తప్ప నిజం కాదు. కాస్ట్ పెరిగిపోవడంతో ప్రధాన పాత్ర ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హీరోల రెమ్యూనరేషన్ దే.

మన హీరోలు ఎంత దారుణంగా ఉన్నారు అంటే… మొన్నా మధ్య ఒక హీరో అది కూడా మీడియం సినిమాలు తీసే హీరో తన ల్యాండ్ మార్క్ సినిమాకు శ్రీకారం చుట్టారు.

సినిమా కొంత తక్కువ బడ్జెట్ లో తీసే అవకాశం ఉండటంతో కొత్త నిర్మాతలు సంబరపడ్డారు. అయితే ఆ సంబరం ఎంతో కాలం నిలువలేదు. సినిమా తక్కువలో తీస్తున్నాం కాబట్టి ఎంతైతే తగ్గిందో ఆ మొత్తం తన రెమ్యూనరేషన్ లో యాడ్ చేసెయ్యమని చెప్పాడు సదరు హీరో.

చేసేది ఏమీ లేక సరే అన్నారు ఆ నిర్మాతలు. అయితే కొత్త డైరెక్టర్ హేండిల్ చెయ్యలేని కారణంగా ఆ సినిమా బడ్జెట్ ముందు అనుకున్నట్టుగా తక్కువ అవ్వలేదు. భారీగానే తేలింది లెక్క. తక్కువ అవుతుందని ఎక్కువ తీసుకున్న హీరో ఇప్పుడు ఏమన్నా హెల్ప్ చేస్తాడా అంటే… ఆ ఒక్కటీ అడగొద్దు అనడం షరా మాములే.

హీరోల రెమ్యూనరేషన్లతో అయిపోయే పరిస్థితి కూడా ఉండటం లేదు. వారి ఆన్ లొకేషన్ ఖర్చుల నుండి కొంత మంది నిర్మాతలకు హీరోల వెకేషన్ ఖర్చులు, వారి సతీమణుల షాపింగ్ ఖర్చులు కూడా యాడ్ అవుతున్నాయి.

హీరోల ఫుడ్, ట్రావెల్, వసతి వంటివి అన్ని ఫైవ్-స్టార్ లెవెల్. అది సరిపోదు అన్నట్టు వారితో వచ్చే స్టాఫ్… వారి జీతాలు, బత్తాలు ఎక్సట్రా. హీరోలు తమకు జనరల్ గా పని చేసే స్టాఫ్ జీతాలు కూడా సినిమా సైన్ చెయ్యగానే ప్రొడ్యూసర్ అకౌంట్ కు మార్చేస్తారు.

అయితే హీరోలదేనా తప్పు? ఇంకెవరిదీ లేదా? అంటే తప్పకుండా వేరే వాళ్ళ పాత్ర ఉంది. రోజుకు మూడు లక్షలు తీసుకునే సపోర్టింగ్ ఆర్టిస్టులు, తాను సినిమా చేస్తునంత సేపు పార్క్ హయత్ లో రెండు సూట్ రూంలు తియ్యాల్సిందే అనే మ్యూజిక్ డైరెక్టర్ల దోపిడీ కూడా నిర్మాతలకు ఇబ్బందే.

అయితే సిస్టం అంతా హీరోల మీద నడిచే వ్యవస్థ మనది. వాళ్ళు సెట్ అయితే అంతా సెట్ అవుతుంది. కానీ వాళ్ళు మాత్రం తగ్గరు. వాళ్ళను చూసి మిగతా వాళ్ళందరూ అలాగే తయారు అవుతారు.

ఈ కారణంగానే ఇండస్ట్రీలో ‘రెగ్యులర్ నిర్మాతలు’ లేకుండా పోతున్నారు. అల్లు అరవింద్ లాంటి వాళ్లు సైలెంట్ ఐపోవడానికి కారణం అదే. అయితే ఇవన్నీ అల్లు అరవింద్ కి కాకుండా ఎవరికి తెలుసు? కాకపోతే కడుపు తీపి మాట్లాడనివ్వదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

The Paradise To Chiranjeevi: Srikanth Odela’s Bigger Test

Srikanth Odela’s The Paradise is carrying huge expectations. The Nani starrer is finally locked for…

10 minutes ago

Parasuram’s Next: Big Scale, Big Production House

Director Parasuram Petla is lining up a big-budget film with the producers of HanuMan. As…

41 minutes ago