
ఆయన పెట్టిన సమావేశం ఏంటి? మేము బలిసి కొట్టుకునేది ఏంది? సినిమా ఇండస్ట్రీని అవమానించి మాట్లాడడం ఆయనకు తగదు. రాజకీయ నాయకుడుగా ఆయన ఏం చేసుకున్నా మాకు అనవసరం. ఎవ్వరూ ఇక్కడ బలిసి కొట్టుకోవడం లేదు. ఒక సినిమా నటించాలంటే 100 అడుగులు రోప్ కట్టుకుని దూకుతారు, ఒక్కసారి ఆయన 100 అడుగులు ఎక్కి దూకితే, ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో తెలుస్తుంది.
మీడియా ఉంది కదా అని ఏదోకటి మాట్లాడేస్తే హీరోలు అయిపోతారని కాదు, మీ రాజకీయ జీవితం ఏమిటో కొవ్వూరులో ప్రజలను అడిగితే తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, ఇక్కడ ఎవరూ బలిసి కొట్టుకోవడం లేదు. ఒకవేళ అది మీకు వర్తిస్తుందేమో, బలిసి కొట్టుకోవడం అనేది మీకు వర్తిస్తుందేమో, ఒక్కసారి సినిమా షూటింగ్ కష్టం ఏమిటో తెలిస్తే ఇలా మాట్లాడరు.
సమాజంలో ఎవరూ మాట్లాడకూడని దుర్భాషను నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు. వాళ్ళ నాన్న గారు అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. ఎంతో మంది కష్టపడితే ఇండస్ట్రీ ఉంది. మేము చాలా మాట్లాడొచ్చు, సినిమా ఇండస్ట్రీకి అవమానించి మాట్లాడడం ఆయనకు తగదు – ఇది ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఘాటుగా స్పందించారు.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…